ఎల్లారెడ్డిపేటలో పాడి కౌషిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

పాల్గొన్న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల ముదిరాజు కులస్తులు పాత బస్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్, కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ అనంతరం దిష్టిబొమ్మ ధగ్ధం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల ముదిరాజ్ కులస్తులు సుమారు 1000, మందికి పైగా పాత బస్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్, కొత్త బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 Padi Kaushik Reddy Effigy Burned In Ellareddypet , Ellareddypet, Padi Kaushik Re-TeluguStop.com

అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఉమ్మడి మండలాల ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ ముదిరాజు కులస్తులను కులం పేరుతో దూషించి మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని, పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

తొలగించని పక్షాన యావత్ తెలంగాణ ముదిరాజ్ కులస్తులు అందరం కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు, చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల ముదిరాజ్ సంఘం నాయకులు కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube