ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు( Christians ) ఎక్కువమంది ఉన్నారు.క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు.
చాలామంది క్రైస్తవ మతంలోకి మారేవారు కూడా ఉన్నారు.పల్లెటూళ్లల్లో ఎక్కువమంది క్రైస్తవ మతంలోకి మారుతూ ఉంటారు.
ఇక ఇండియాలో కూడా క్రైస్తవులు పెద్ద సంఖ్యలోనే ఉండగా.చాలామంది వేరే మతాల నుంచి ఆ మతంలోకి మారుతూనే ఉన్నారు.
అయితే క్రైస్తవ మత ప్రచారకులైన పాస్టర్లు, ఫాదర్లకు విదేశాల నుంచి నిధులు వస్తాయని చెబుతూ ఉంటారు.అంతేకాకుండా పెద్ద పెద్ద చర్చీల నిర్మాణం, కాలేజీలు ఏర్పాటు వంటి వాటికి నిధులు వస్తాయని చెబుతున్నారు.

ఇండియాలో పెద్ద పెద్ద చర్చిలు చాలా ఉన్నాయి.కాథలిక్ చర్చ ఆఫ్ ఇండియా ( Catholic Church of India )రెండవ అతిపెద్ద భూయజమానిగా ఉంది.172.9 మిలియన్ ఎకరాలు కలిగి ఉంది.కేంద్ర ప్రభుత్వం తర్వాత అతిపెద్ద భూయజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఉంది.ఈ భూముల్లో స్కూళ్లు, కాలేజీలు, చర్చిలు నిర్మించింది.వీటి విలువ దాదాపు రూ.20 వేల కోట్లు ఉంటుంది.గోవా ( Goa )నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా విస్తరించి ఉంది.ఇండియాలో ఉపాధి కలిగించే అతిపెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఇది ఒకటిగా ఉంది.

దేశంలో 2457 హాస్పిటల్ డిస్పెన్సరీలు, 240 మెడికల్, నర్సింగ్ కాలేజీలు, 28 జనరల్ కాలేజీలు, 3765 సెకండరీ స్యూల్స్, 7319 ప్రైమరీ స్కూల్స్, 3187 నర్సరీ స్కూళ్లు, 5 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి.క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడంతో పాటు దాదృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఇక కాథలిక్ చర్చి యొక్క పాలకమండలి కాథలిక్ బిషప్స్ కాన్పరెన్స్ ఆఫ్ ఇండియా క్రైస్తవుల అతిపెద్ద నాయకుడైన పోప్ ఫ్రాన్నిస్ ఆధ్వర్ంయలో ఉంది.







