అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ( Telangana ) భాజాపాన ఒక గాడిలో పెట్టాలని భాజపా అధిష్టానం డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )వ్యవహార శైలిపై అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సీనియర్ నేతలు, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని తెగేసి చెప్పారట.
సీనియర్ నేతలను కలుపుకుని వెళ్లాల్సిన స్థానే సొంత నిర్ణయాలతో పార్టీని ఇక్కట్ల పాలు చేస్తున్నారని, తద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.అధిష్టానం కూడా దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది .

అయితే పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన బండి సంజయ్ పదవి నుంచి తొలగిస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్న అధిష్టాన ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని సముచిత స్థానంతో గౌరవించాలని భావిస్తున్నదట.సామాజిక వర్గ సమీకరణాలు కూడా అందుకు అనుకూలించడంతో బండికి అమాత్య యోగం పట్టనున్నట్లు తెలుస్తుంది.భాజపా అధ్యక్షుడి స్థానానికి కిషన్ రెడ్డిని( Kishan Reddy ) పరిశీలిస్తున్నప్పటికీ ఆయన ఆ పదవిపై అంతగా ఆసక్తి లేదని తెలుస్తుంది .ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉన్నందున పార్టీ ని పునర్నిర్మించడం కష్టసాధ్యమని కిషన్ రెడ్డి భావిస్తున్నారట.దాంతో కే లక్ష్మణ్ ( K Laxman )కి అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతుంది.పార్టీలోని అంతర్గత విభేదాలను తొందరగా పరిష్కరించుకొని లక్ష్యం దిశగా కదలక పోతే సరయిన పలితాలు రావని బావిస్తున్న అధిష్టానం తమ నిర్ణయాలలో వేగం పెంచినట్టు తెలుస్తుంది.

ఈటెల రాజేందర్ కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పజెప్పి, కే లక్ష్మణ్ కు అధ్యక్షుడు బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా వీరిద్దరి మధ్య సమన్వయం బాగుంటుందని పార్టీని క్రియాశీలకంగా ముందుకు తీసుకువెళ్తారని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున పార్టీ మధ్య అంతర్గత విభేదాలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే పార్టీ భవిష్యత్తుకు అంతా మంచిదని వార్తలు వస్తున్న దరిమి లా త్వరగా పార్టీ ట్రాక్లోకి వస్తుందా అని కమల నాధులు మరియు పార్టీ అభిమానులు ఎదురుచూస్తున్నారు
.






