బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్( Megastar Prabhakar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా ప్రభాకర్ ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.
ప్రభాకర్ కు ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.అయితే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ( Chandrahas )గతంలో ట్రోల్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యాడు.
చంద్రహాస్ హీరోగా రెండు మూడు సినిమాలు ప్రారంభమవుతున్నట్టు కొన్ని నెలల క్రితం ప్రకటనలు వెలువడ్డాయి.అయితే ఈ మధ్య కాలంలో చంద్రహాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు.
చంద్రహాస్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయా? లేదా? అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.ప్రభాకర్ లేదా చంద్రహాస్ స్పందిస్తే ఈ ప్రశ్నల గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై ట్రోల్స్ వచ్చినా ప్రభాకర్ కొడుకు కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చాలామంది కామెంట్లు చేశారు.అయితే ట్రోల్స్ చంద్రహాస్ కెరీర్ కు శాపమయ్యాయని అతనితో సినిమాలు తెరకెక్కించే దర్శకనిర్మాతలు( Directors ) ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోగట్టా.అయితే చిన్న హీరోల సినిమాలకు కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న నేపథ్యంలో చంద్రహాస్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

చంద్రహాస్ కెరీర్ విషయంలో జాగ్రత్త వహిస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు.చంద్రహాస్ పారితోషికం 50 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.ప్రభాకర్ చంద్రహాస్ కెరీర్ పై దృష్టి పెట్టాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హీరో చంద్రహాస్ కు తన ట్రోల్స్ వల్లే క్రేజ్ ను పెరుగుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







