ప్రత్యామ్నాయ నాయకుడిగా పవన్ !

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయంలో ఇప్పుడు పరిణితి చెందినట్లుగానే కనిపిస్తుంది.తన సినిమా అభిమానుల్ని తన కార్యకర్తలుగా మార్చుకున్న పవన్ గత పది సంవత్సరాలుగా వారి ని ఆకట్టుకునేలాగా మాట్లాడుతూ వచ్చారు .

 Pavan Is The Alternate Force In Ap Politcis , Pawan Kalyan, Politics, Ycp, Andhr-TeluguStop.com

ఆయా సమస్యలపై ఊగిపోతూ పవన్ మాట్లాడే శైలి యువతకు, ఆయన అభిమానులకు నచ్చినా కూడా తటస్థ ఓటర్లకు సామాన్య జనానికి ఆయన చెరువు కాలేదనే చెప్పాలి .అయితే గత కొంతకాలంగా పవన్ నిలకడైన రాజకీయం ( politics )చేస్తూ వస్తున్నారు.స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటూ సమాజంలో ఉన్న ఆయా వర్గాల ప్రతినిధులకు పెద్దలకు గౌరవం ఇస్తూ నియోజకవర్గ వారీగా ఉన్న సమస్యలపై పవన్ ఇస్తున్న హామీలు కూడా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి.

Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Ubayagodavari, Varahi-Telugu Poli

ఇప్పటివరకు తెలుగుదేశం పరిపాలనను వైసీపీ( YCP ) పరిపాలనను దగ్గరగా చూసిన ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రజల కు పవన్ ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు.ప్రజా సమస్యలను సూటిగా ప్రస్తావిస్తూ పరిష్కారానికి ఆయన ఇస్తున్న హామీలు విధానాలు సాదారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నాయి.వారాహి విజయ యాత్రలో మహిళలు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వటం దీనికి సంకేతం గానే చూడాలి .పవన్ వివిధ వర్గాలకు చేరువవుతున్నారనడానికి వారాహి( Varahi) యాత్రకు వచ్చిన స్పందనే సంకేతం గా చూడాలి .కుల మతాలకు అతీతం గా పవన్ ను ప్రజలు ఆదరిస్తునారాని తెలుస్తుంది.ఉబయ గోదావరి జిల్లాల పర్యటన జనశెన రాజకీయ ప్రయాణం లో ఒక కీలక మలుపు గానే చూడాలి.

Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Ubayagodavari, Varahi-Telugu Poli

స్థానిక నేతల అవినీతిపై కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కానీ సూటిగా స్పందిస్తున్న పవన్ ప్రభుత్వ వ్యతిరేక వర్గాలలోను తటస్థ వోటర్ల లోను ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతున్నాడు .ఇదే పందాను ఆయన వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తే మాత్రం రాజకీయాల్లో క్రియాశీలక ప్రభావం చూపించే నాయకుడిగా పవన్ ఎదుగుతాడని వచ్చే కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలపై పవన్ తనదైన ముద్ర వేస్తాడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube