సల్మాన్ ఖాన్ ను మాత్రం కచ్చితంగా చంపేస్తాం.. గోల్డీ బ్రార్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ కు( Salman Khan ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సల్మాన్ ఖాన్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.అయితే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ గోల్డీ బ్రార్ ( Goldy Brar ) సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

 Gangster Goldy Brar Death Threat To Salman Khan Details, Gangster Goldy Brar , S-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ జాతకం అస్సలు బాలేదు.

సల్మాన్ ఖాన్ కు వరుసగా బెదిరింపులు ఎదురవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్ స్టర్ ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేయడం జరిగింది.సల్మాన్ ఖాన్ ను మాత్రమే కాదని గతంలో చెప్పిన కొంతమంది శత్రువులను సైతం కచ్చితంగా చంపేస్తామని గోల్డీ బ్రార్ అన్నారు.

తమ లక్ష్యం సల్మాన్ ఖాన్ అని సల్మాన్ ను చంపే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని గోల్డీ బ్రార్ పేర్కొన్నారు.

Telugu Bollywood, Gangstergoldy, Goldie Brar, Goldy Brar, Salman Khan, Salmankha

మేము ప్రయత్నిస్తూనే ఉంటామని మేము సక్సెస్ సాధించిన సమయంలో మీకు తెలుస్తుందని ఆయన అన్నారు.సిద్ధూ మూసే వాలా( Siddhu Moosewala ) హత్య కేసులో కూడా ఈ గ్యాంగ్ స్టర్ ప్రమేయం ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.గోల్డీ బ్రార్ కూడా సిద్ధూ మూసే వాలా హత్య కేసులో తమ ప్రమేయం ఉందని వెల్లడిస్తున్నారు.

వ్యక్తిగత కారణం వల్లే సిద్ధూను హత్య చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

Telugu Bollywood, Gangstergoldy, Goldie Brar, Goldy Brar, Salman Khan, Salmankha

గోల్టీ బ్రార్ గ్యాంగ్ సభ్యులలో ఒకరైన లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.గోల్డీ బ్రార్ కామెంట్ల గురించి సల్మాన్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలతో సల్మాన్ కు కచ్చితంగా సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube