చాలామంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ US మార్కెట్లో ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తూ వుంటారు.అవకాశం వస్తే అమెరికన్ కంపెనీల షేర్లు కొనాలని అనుకునేవారు కూడా ఇక్కడ లేకపోలేదు.
అయితే అమెరికన్ స్టాక్స్( American stocks ) లో ట్రేడింగ్ చేయడం అనేది పెద్ద విషయమేం కాదు అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.మీరు మీ ఇంట్లో కూర్చుని యూఎస్ షేర్లతో ఆటాడుకోవచ్చని అంటున్నారు.
కొన్ని మార్గాల ద్వారా… ఆపిల్, గూగుల్, టెస్లా, అమెజాన్( Apple, Google, Tesla, Amazon ) వంటి దిగ్గజ కంపెనీల షేర్లను కొని, అమ్మవచ్చని మీకు తెలుసా? అయితే, ఇక్కడ రిస్క్ కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇకపోతే US స్టాక్ ట్రేడింగ్ ప్రయోజనాన్ని పొందడానికి సులభమైన మార్గం.మ్యూచువల్ ఫండ్స్.ఇప్పుడు, ఇండియన్ AMCలు చాలా అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లను అందిస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసినదే.
ఆ పథకాల్లో మీరు పెట్టుబడి పెడితే, ఇన్-డైరెక్ట్ గా ఆయా స్టాక్స్ అన్నీ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నట్లే.మ్యూచువల్ ఫండ్ కాకుండా, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఆప్షన్ కూడా ఉంది.
ETFలు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ సహాయంతో US స్టాక్స్ ని ఈజీగా ట్రేడ్ చేయవచ్చు.పైన చెప్పిన ఇన్-డైరెక్ట్ పద్ధతుల్లో కాకుండా, మీరు నేరుగా అమెరికన్ స్టాక్స్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటే, మరో ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.
ఈ పని కోసం NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్( NSE International Exchange ) మీకు సాయం చేస్తుంది.

అవును, గత ఏడాది మార్చిలో, అమెరికాలోని టాప్ 8 కంపెనీలతో NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ అనేది మొదలయ్యింది.NSE అందిస్తున్న ఆప్షన్ ద్వారా, అమెజాన్, టెక్ జెయింట్స్ మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, నెట్ఫ్లిక్స్, వాల్మార్ట్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లా, ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీ ఆపిల్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.మీకు చేతనైనన్ని షేర్లు కొని ఈ కంపెనీల్లో కొంత ఓనర్షిప్ కూడా చేజిక్కించుకోవచ్చు.
అమెరికన్ స్టాక్స్లో ట్రేడింగ్ కోసం, గిఫ్ట్ సిటీలో, NFC IFSC పేరుతో, ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్కు అనుబంధ సంస్థను NSE ఏర్పాటు చేసింది.అమెరికన్ కంపెనీల షేర్ల కోసం NSE IFSC ద్వారా డిపాజిటరీ రిసిప్ట్స్ జారీ అవుతాయి.
మరిన్ని వివరాలకు మీరు సదరు మార్కెట్ నిపుణుల సాయం తీసుకోవలసి ఉంటుంది.








