తెలుగు ప్రేక్షకులు చిరస్థాయిగా గుర్తించుకునే చిత్రాలు కోకొల్లలుగా ఉన్నాయి.అలాంటి చిత్రాలలో ఒకటి అరుంధతి( Arundhati ) అనుష్క ప్రధాన పాత్రలో, కోడి రామకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆరోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామి మామూలుది కాదు.
ఆరోజుల్లో ఈ సినిమా అప్పటి ఇండస్ట్రీ కి పోకిరి చిత్రానికి అతి చేరువగా వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు.ఎలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అనేది.
ముఖ్యంగా ఆడియన్స్ ని థియేటర్స్ లో ఒక రేంజ్ లో బయపెట్టేసింది ఈ చిత్రం.ముఖ్యంగా పశుపతి గా సోనూసూద్ నటన అద్భుతం.
ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమాకి హీరో ఆయనే.అంతకు ముందు అనుష్క మరియు సోను సూద్ కలిసి నాగార్జున నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.
ఈ చిత్రం లో వీళ్లిద్దరు అన్నా చెల్లెళ్లుగా నటించారు.ఆ తర్వాత కొన్నాళ్ళకు వీళ్లిద్దరు ఒకరిని ఒకరు ఢీ కొట్టుకుంటూ ‘అరుంధతి’ చిత్రం చేసారు.

ట్రేడ్ పండితుల లెక్కప్రకారం ఆరోజుల్లోనే ఈ సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందట.అనుష్క కి ఈ సినిమా ద్వారానే సూపర్ స్టార్ స్టేటస్ దక్కింది.ఈ చిత్రం తర్వాత ఆమె మార్కెట్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ కి ఎదిగింది.అప్పట్లో 30 కోట్ల రూపాయిల షేర్ దాటినా హీరో మహేష్ బాబు మాత్రమే.
ఆయన తర్వాత ఆ క్లబ్ లోకి చేరింది అనుష్క ఒక్కటే.ఆ సినిమా తర్వాత మన స్టార్ హీరోలవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా అరుంధతి వసూళ్లను దాటలేకపోయాయి.ఇక పోతే అప్పట్లో ప్రేక్షకులను ఒక రేంజ్ లో భయపెట్టిన పశుపతి క్యారక్టర్ కోసం ముందుగా సోను సూద్( Sonu Sood ) ని అనుకోలేదట.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా రాణిస్తున్న జగపతి బాబు కోసం ఆ క్యారక్టర్ రాసుకున్నారట.

అప్పటికి ఆయన ఇండస్ట్రీ లో హీరోగానే కొనసాగుతూ ఉన్నాడు.విలన్ పాత్రలకు అప్పట్లోనే సిద్ధం అని చెప్పాడు కానీ, జగపతి బాబు( Jagapathi Babu ) కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజి వల్ల ఎవ్వరూ సాహసం చేయలేకపోయారు.కానీ కోడి రామకృష్ణ ఆ సాహసం చేసి, ఆయనని ఈ పాత్ర కోసం అడిగారు.‘పశుపతి’ అంటే కామపిశాచి క్యారక్టర్ అనేది మన అందరికీ తెలిసిందే.జగపతి బాబు కి మంచి ఫ్యామిలీ హీరో గా పేరుంది.
ఆయన ఈ క్యారక్టర్ న్యారేషన్ విన్న తర్వాత కోడి రామకృష్ణ తో ‘నన్ను తీసుకుంటే మీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది, నన్ను అలాంటి క్యారెక్టర్స్ లో ఎవరూ చూడరు, భారీ బడ్జెట్ పెట్టి సినిమాని తియ్యాలని అనుకుంటున్నారు, నేను ఆ క్యారక్టర్ కి న్యాయం చెయ్యలేను, ఏమనుకోకండి’ అని చెప్పి పంపేసాడట.అలాంటి జగపతి బాబు 2014 వ సంవత్సరం నుండి నేటి వరకు ఎలాంటి పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నాడో మన అందరికీ తెలిసిందే.







