తనలో ఎంత టాలెంట్ ఉంది అన్నది ది కేరళ స్టోరీస్( The Kerala Story ) సినిమాతో చూపించిన అదా శమర్ అనుకోని విధంగా తన ఖాతాలో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అదా శర్మ ని ఇన్నాళ్లు మనమే తక్కువ అంచనా వేశాం కానీ ఆమె లో చాలా టాలెంట్ ఉంది అని గుర్తించేలా చేశారు.
ది కేరళ స్టోరీ సినిమాతో అదా శర్మ ( Adah Sharma )పేరు దేశం మొత్తం మారుమోగుతుంది.ఇక ఆ సినిమా హిట్ తో ఆమె వెంట క్యూ కడుతున్నారు దర్శక నిర్మాతలు.
అదా శర్మకు ఇప్పుడు అన్ని భాషల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట.
తనని సైడ్ హీరోయిన్ చేసిన టాలీవుడ్( Tollywood ) నుంచి కూడా ఇప్పుడు అదా శర్మకి మంచి ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.అదా శర్మ తో ఈమధ్య తెలుగు దర్శక నిర్మాతలు కలిసి మాట్లాడారట.ఆమెతో తెలుగులో ఒక క్రేజీ ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయాలని అనుకుంటున్నారట.
మొత్తానికి అదా శర్మ తిరిగి ఫాం లోకి వచ్చింది.కెరీర్ దాదాపు ముగిసింది అనుకునే టైం లో అదా శర్మకి ది కేరల స్టోరీ సినిమా ఆమెని తన టాలెంట్ చూపించేలా చేసింది.
అలా ఆమె మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.