రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( BRS Party Leader CM KCR ) పార్టీ శ్రేణులను నిత్యం ప్రజల్లో ఉండేలా పదేపదే హిత బోధ చేస్తున్నారు.పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించడం వంటివి చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని , రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో కేసీఆర్ ఉండగా, కొంతమంది పార్టీ కీలక నేతల తీరు వివాదాస్పదంగా మారుతూ ఉండడం, తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉండడం వంటివి తలనొప్పిగా మారాయి.
ఈ క్రమంలోనే హుజురాబాద్ పార్టీ ఇన్చార్జి ,ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి( BRS MLC Padi Kaushik Reddy ) వ్యవహారం బీ ఆర్ ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.ఆయన ఎమ్మెల్సీగా నియామకం అయినప్పటి నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వరకు ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే వస్తున్నారు.
గవర్నర్ నుంచి మొదలుపెడితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్( Kaushik Reddy Youtube Channel Cameraman Issue ) పై కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు వంటివి బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.

వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా( Huzurabad MLA ) పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలు పార్టీ అధిష్టానం ఉండగా, ఇప్పుడు ఆ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కెసిఆర్ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారు.అలాగే ప్రభుత్వ విప్ గానూ ప్రమోషన్ కల్పించారు.
అయితే ఇటీవల కేటీఆర్( Minister KTR ) హుజూరాబాద్ పర్యటన సందర్భంగా కౌశిక్ రెడ్డిని స్థానికంగానే ఉండాలని , ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కౌశిక్ రెడ్డికి సూచించారు.దీంతో ఆయనకు టికెట్ దక్కబోతోంది అనే ప్రచారం జరిగింది.
కేటీఆర్ కూడా అదేవిధంగా సంకేతాలు ఇచ్చారు.కానీ ఇటీవల కాలంలో కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆపాది జమ్మికుంటలో రైతు సదస్సు( Rythu Sadassu )లో ఓ రైతు ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా, కౌశిక్ రెడ్డి ఆయనను ఉద్దేశించి సిగ్గు శరం లేదా అంటూ మాట్లాడడం వివాదం అయింది.చెరువుల పండుగ రోజున జమ్మికుంటలో నాయిని చెరువు వద్ద ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మికుంటలోని రైల్వే బ్రిడ్జిని కూల గొట్టిస్తానంటూ మాట్లాడడం కూడా వైరల్ అయింది.అలాగే తెలంగాణ అమరవీరుల స్మారకం రోజున హుజూరాబాద్ టౌన్ లో ఓ యూట్యూబ్ ఛానల్ కెమెరా మెన్ ను చిత్రహింసలకు గురిచేస్తూ తిట్టడం ,అలాగే ఓ సామాజిక వర్గాన్ని చులకన చేస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.ఆ వర్గం వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ఇదే విధంగా మరికొన్ని వివాదాస్పద అంశాలు కౌశిక్ రెడ్డి గ్రాఫ్ తగ్గిస్తూ ఆయన టిక్కెట్ కి ఎసరు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి.







