బీఆర్ఎస్ లో వీరికి టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా ? 

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో,  టికెట్ల కేటాయింపు విషయమే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) తీవ్రంగానే చర్చిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారు అనుకున్నవారికి టికెట్లు ( BRS Tickets ) ఇవ్వాలని కేసిఆర్ నిర్ణయించుకున్నారు.

 Cm Kcr Confirmed Brs Party Tickets To These Political Leaders Details, Brs, Tela-TeluguStop.com

ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా రంగంలోకి దించితే అనుకూలంగా ఉంటుందనే విషయంపై కేసీఆర్ ఒక క్లారిటీకి వచ్చారు.దీంతో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు కన్ఫామ్ చేస్తున్నట్లు సమాచారం.

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనలు, దశాబ్ది ఉత్సవాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఇతర ఆశావాహుల పనితీరు ఆధారంగా జాబుతాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Minister KTR ) నియోజకవర్గాలు, జిల్లా పర్యటనలలో పరోక్షంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేయబోయేది వీరేనంటూ హింట్ ఇస్తున్నారు.

Telugu Brs Tickets, Gandravenkata, Telangana-Politics

ఇప్పటి వరకు దాదాపు 20 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు , మరో ఆరు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదే విధంగా పార్టీ అధికారిక కార్యక్రమాల్లో మరి కొంతమంది అభ్యర్థుల పేర్లను పరోక్షంగా లీక్ చేస్తున్నారు.జులై నెలలోగా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసే విధంగా బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పనితీరు బాగా లేని వారు,  ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని తప్పించాలని నిర్ణయించుకున్నారు.

అలాగే విపక్ష పార్టీలు పోటీకి దించే అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నారట.ఇప్పటికే కొన్ని కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి కేసీఆర్,  కేటీఆర్ లీకులు ఇచ్చారు .ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.

Telugu Brs Tickets, Gandravenkata, Telangana-Politics

మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి, గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి, ఆరూరి రమేష్ వర్ధన్నపేట, ఒడితెల సతీష్ కుమార్ హుస్నాబాద్, దాస్యం వినయ భాస్కర్ వరంగల్ పశ్చిమ, నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ .వీరు ప్రస్తుతానికి కేసీఆర్, కేటీఆర్ జాబితాలో ఉన్నారట.వీరితో పాటు గువ్వల బాలరాజు అచ్చంపేట, ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర, జాజాల సురేందర్ ఎల్లారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం, సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి, ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆర్మూరు, బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్,  షకీల్ అహ్మద్ బోధన్, మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ లకు టికెట్ కన్ఫర్మ్  చేయబోతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube