ఆ విషయంలో టిడిపి- జనసేన క్లారిటీ గానే ఉన్నాయా ?

పవన్ విశాఖపట్నం పర్యటన( Pawan Kalyan Visakhapatnam Tour ) లో జరిగిన గొడవ తర్వాత తదుపరి పరిణామాలన్నీ జనసేన తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కార్యాచరణ దిశగా పురిగొల్పిన విషయం తెలిసిందే .తానుగా ఒక అడుగు ముందుకు వచ్చి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు( TDP Chandrababu Naidu ) చేసిన ప్రయత్నానికి పవన్ కూడా అంగీకరించడంతో ఇరు పార్టీల పొత్తు అనివార్యమని, ఆ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైంది.

 Pawan Kalyan And Chandrababu Has Fixed Understanding About Alliance?,pawan Kalya-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా ఇరు పార్టీలు పాదయాత్రలు, బహిరంగ సభల పేరుతో ప్రజల్లో హల్చల్ చేస్తున్నాయి.అయితే ఈ యాత్రలలో ఆయా నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రం పొత్తు పై గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి.

మధ్యలో అధికార పార్టీ వైసీపీ కూడా తమ మంత్రులు నాయకుల ప్రకటనలతో వాతావరణాన్ని మరింత గందరగోళంగా మార్చింది .ఇప్పటికిప్పుడు రెండు పార్టీలు కలిసినడుస్తాయా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఇరు పార్టీల కార్యకర్తల్లోనూ ఉంది.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

అయితే ఇదంతా వ్యూహాత్మకమే అని,ఇరుపార్టీల అధినాయకులు మధ్య స్పష్టమైన అవగాహన ఉందని, ఇప్పటికిప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకొని పొత్తులు ప్రకటిస్తే అసంతృప్తులు పెరిగితే దానిని అధికార పార్టీ క్యాష్ చేసుకొనే అవకాశం ఉందని ఆ వాతావరణం లేకుండా చూడడం కోసం మాత్రమే ఎవరికి వారే విడిగా ప్రచారం చేసుకుంటున్నారని, తమ పార్టీ బలాబలాలను పెంచుకొని వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకొని అప్పుడు పొత్తు నిర్ణయాలను ఫైనల్ చేసుకోవాలని, లేకుంటే గెలిచిన తర్వాత సీట్ల షేరింగ్ బట్టి అయినా ఒక అవగాహన ఒప్పందానికి రావాలనే స్పష్టమైన అంగీకారంతోనే ఇరు పార్టీలు అధినేతలు ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

అందువల్లనే వారాహి యాత్ర( Varahi Yatra ) లో తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న పవన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు నుంచి ఏ రకమైన విమర్శలు రాకపోవడానికి అధినేత సూచనలే కారణమని, పవన్తో ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే పవన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు సూచించారని వార్తలు వస్తున్నాయిఇది అర్థం చేసుకున్నారు కనుకనే అధికార పార్టీ మంత్రులు నాయకులు ఇప్పటికీ పవన్ ను చంద్రబాబు డైరెక్షన్ ప్రకారమే నడుస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారని తెలుస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube