సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు మూడు పదుల వయసుకు దాటి నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే చాలామంది ఉన్నారు.హీరోలు హీరోయిన్లు ఇప్పటికీ ఐదు పదుల వయసు వచ్చిన కూడా చేసుకొని వారు చాలామంది ఉన్నారు.
కెరియర్లో స్థిరపడాలి అనుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అలాగే బ్రహ్మచారులుగా చాలామంది ఉన్నారు.చాలామంది పెళ్లి చేసుకోకుండా రిలేషన్షిప్ అంటూ ఒకరి తర్వాత ఒకరితో రిలేషన్ లలో ఉంటున్నారు.
కొంతమంది హీరోయిన్లు లేటు వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ తల్లిగా మారుతున్నారు.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు లేటు వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ తర్వాత తల్లిగా మరి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు.
తాజాగా కూడా ఒక నటి దాదాపు 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొని తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె మరెవరో కాదు.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటి షర్మిలి. ఈమె పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది హాస్య నటి షర్మిలి.

ఇంటర్య్వూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నేను 40 ఏళ్ల వయసులో ఒక ఐటి ప్రొఫెషనల్ ను పెళ్లి చేసుకున్నను.నాకు ప్రస్తుతం వయసు 48 ఏళ్ళు.ప్రస్తుతం నేను గర్భవతిని.త్వరలో తల్లి కాబోతున్నాను అని తెలిపింది షర్మిలి.
అనంతరం తన భర్త గురించి స్పందిస్తూ.అతను నాకు ఎప్పుడూ అన్ని విషయాల్లో మద్దతు ఇస్తాడు.
ప్రసవం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తాను అని తెలిపింది షర్మిలి.







