తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్( Hero Nikhil ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిఖిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా నిఖిల్ నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.ఇకపోతే త్వరలోనే స్పై అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఎడిటర్ గ్యారీ బి.హెచ్( Gary BH ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అంతేకాకుండా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాని జూన్ 29న తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ని మరోసారి డ్రగ్స్ వివాదం( Drugs ) చుట్టుముట్టింది.తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్ డ్రగ్స్ పై సంచలన వాఖ్యలు చేశాడు.
కాగా గతంలో డ్రగ్స్ వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే.

తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి( Producer KP Chaudhary ) కస్టడీలో వెల్లడించిన అంశాలతో టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం మరోసారి కలకలం రేగింది.ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై యంగ్ హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర మాతక ద్రవ్యాల నిరోదక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన అనే ఓ కార్యక్రమంలో నటుడు ప్రియదర్శి( Actor Priyadarshi )తో కలిసి పాల్గొన్నారు నిఖిల్.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నన్ను కొంతమంది డ్రగ్స్ తీసుకోమని ఆఫర్ ఇచ్చారు.ఒక్కసారి దానికి అలవాటు అయితే జీవితం సర్వనాశనం అవుతుందని భావించాను.అందుకే ఎప్పుడూ అలాంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చాను.
దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో గొప్పది.దాన్ని మంచి పనులకు వినియోగించాలి అని తెలిపారు నిఖిల్.
విద్యార్థులకు ఎంతో మంచి అందమైన జీవితం ఉంది సరదాగా పార్టీలకు వెళ్లి డ్రగ్స్ మాత్రం తీసుకోవద్దని హెచ్చరిస్తూ మంచి మంచి విషయాలను వెల్లడించారు నిఖిల్.







