బీజేపీ కి దగ్గరవుతున్న కేసీఆర్ ? ' బండి ' పరిస్థితి ఏంటో ?

బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఉండవు.ఎప్పుడు ఎందుకు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు.

 Kcr Coming Closer To Bjp? What Is The Condition Of The Bandi Sanjay Kumar , Brs,-TeluguStop.com

మొన్నటి వరకు కేంద్ర అధికార పార్టీ బిజెపిని టార్గెట్ చేసుకుని కెసిఆర్ చాలానే విమర్శలు చేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ తరపున ఆందోళనలు చేశారు.

అలాగే కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడకూడదని చెబుతూ, అనేక బహిరంగ సభలు  అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు.పూర్తిగా బీజేపీ( BJP ) వ్యతిరేక స్టాండ్ తీసుకుని మరీ పోరాటాలు చేస్తూ వస్తున్నా , కేసీఆర్ లో గత కొద్దిరోజులుగా  మార్పు చోటు చేసుకుంది .బిజెపిపై విమర్శల డోసు తగ్గించడంతో పాటు, ఆ పార్టీతో సన్నిహితంగా మెలిగెందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కేసీఆర్ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది.

కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సమయంలో బిజెపిపై విమర్శలు చేశారు అలాగే దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేశారు.

దీనిలో భాగంగానే కర్ణాటకలో కుమారస్వామి,  మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవర్ వంటి వారితోను సన్నితంగా మెలిగారు.బిజెపి వ్యతిరేక కూటమి ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేశారు.

కాంగ్రెస్ బిజెపిలకు వ్యతిరేకంగా కేంద్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని కెసిఆర్ సవాళ్లు చేశారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

కెసిఆర్ తన వెంట వస్తారు అనుకున్న వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు హ్యాండ్ ఇవ్వడంతో ఒంటరి గా మిగిలిపోయారు.

Telugu Congress, Kavitha, Manish Sisodia, Ts-Politics

 ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )పేరు చార్జిషీట్లోకి ఎక్కడం అదే కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం వంటివి చోటు చేసుకున్నాయి.ఇదే కేసులో కవిత అరెస్టు అవుతారనే హడావుడి నడిచింది.సిబిఐ కూడా దూకుడు గా వ్యవహరించింది.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.బిజెపిపై కేసీఆర్ దూకుడు తగ్గించినట్టుగానే వ్యవహరిస్తున్నారు.

ఇక సిబిఐ కూడా దూకుడు తగ్గించడం వంటివన్నీ అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.నిన్న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ జరగగా,  ఆ మీటింగ్ కు కేసిఆర్ హాజరు కాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

అలాగే కేంద్రం ఆధ్వర్యంలో మణిపూర్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి బి ఆర్ ఎస్ తరఫున వినోద్ కుమార్ హాజరయ్యారు.అదే సమయంలో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ తదితరులతో భేటీ అవ్వడం వంటివి అన్నీ చర్చనీయాంశం గా  మారాయి.

Telugu Congress, Kavitha, Manish Sisodia, Ts-Politics

కేంద్రంలో కేసీఆర్ బిజెపి పెద్దలతో ఈ విధంగా సన్నిహితంగా మెలుగుతూ ఉండడం, బిజెపిపై దూకుడు తగ్గించడం వంటివన్నీ ప్రజలలో అనుమానాలు తలేత్తేలా మారడంతో,  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి ఆందోళన చెందుతున్నారు.బిజెపి , బిఆర్ఎస్ ఒక్కటేననే భావన తెలంగాణ ప్రజల్లో వ్యక్తం అయితే అది కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తుందని,  తెలంగాణలో బీ ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా బిజెపి ఎన్ని పోరాటాలు,  ఆందోళనలు చేపట్టినా,  జనం నమ్మే పరిస్థితి ఉండదని టెన్షన్ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube