పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల తో ఎందుకు నటించలేదంటే..?

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తక్కువ టైం లోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.అలా తక్కువ టైం లోనే పవర్ స్టార్ గా ఎదిగి అన్న కి తగ్గ తమ్ముడిగా ఇండస్ట్రీ లో తన కంటి ఒక స్థాయి ని సంపాదించుకున్నాడు….

 Why Didn't Pawan Kalyan Act With These Two Star Heroines, Anushka, Pawan Kalyan,-TeluguStop.com

ఇక త‌న సినిమాల ద్వారా కొత్త హీరోయిన్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.అయితే ఇంత వ‌ర‌కు సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టితో ( Anushka Shetty )మాత్రం ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.

అనుష్క సైతం టాలీవుడ్ లో దాదాపు టాప్ స్టార్స్ అంద‌రితోనూ ఆడిపాడింది.అయితే ఆమె లిస్ట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేరు.

 Why Didn't Pawan Kalyan Act With These Two Star Heroines, Anushka, Pawan Kalyan,-TeluguStop.com

టాలీవుడ్ ( Tollywood లో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ ఉంటాయి.అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అనుష్క శెట్టి కాంబోలో ఒక‌టి.అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో ఓ సూప‌ర్ హిట్ మూవీ మిస్ అయింది.

అవును.మీరు విన్న‌ది నిజ‌మే.

ఇంత‌కీ ఆ హిట్ మూవీ మ‌రేదో కాదు అన్న‌వ‌రం( Annavaram ) సినిమా.భీమినేని శ్రీనివాసరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అసిన్ హీరోయిన్లుగా న‌టించారు.

సంధ్య, వేణుమాధవ్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, శివబాలాజీ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.రమణ గోగుల స్వ‌రాలు స‌మ‌కూర్చారు.సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2006లో విడుద‌లై ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Telugu Annavaram, Anushka, Anushka Shetty, Arti Agarwal, Pawan Kalyan, Tollywood

అప్ప‌ట్లో ఈ చిత్రం రూ.16 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క శెట్టిని అనుకున్నార‌ట‌.కానీ అంతకు ముందే మెగాస్టార్‌ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీలో అనుష్క ఐటెం సాంగ్ చేసింది.

దాంతో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఏమ‌నుకున్నారో ఏమో గాని ఆఖ‌రి నిమిషంలో అనుష్క శెట్టిని కాద‌ని.హీరోయిన్ గా అసిన్ ను తీసుకున్నారు.మొత్తానికి అనుకోకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్-అనుష్క శెట్టి కాంబోలో అన్న‌వ‌రం లాంటి సూప‌ర్ హిట్ మూవీ మిస్ అయిపోయింది.

Telugu Annavaram, Anushka, Anushka Shetty, Arti Agarwal, Pawan Kalyan, Tollywood

ఇక పవన్ కళ్యాణ్ మరో హీరోయిన్ అయిన ఆర్తి అగర్వాల్( Arti Agarwal ) తో కూడా ఒక్క సినిమా చేయలేదు అప్పట్లో ఆర్తి అగర్వాల్ పెద్ద హీరోయిన్ గా ఉంటూ అందరూ స్టార్ హీరోలతో నటించింది… అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆర్తి కాంబో లో మాత్రం సినిమా రాలేదు…ఒక టైం లో గుడుంబా శంకర్ సినిమా లో తనని తీసుకుందాం అనుకున్నప్పటికీ అది కుదరలేదు.ఇలా పవన్ కళ్యాణ్ స్టార్ హీరోయిన్స్ గా ఉన్న ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేయలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube