విలీనమా పొత్తా ? షర్మిల ఏం చేయబోతున్నారో ? 

తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల ఆ పార్టీ నాయకుల్లో ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన్ విజయం సాధించడంతో , తెలంగాణ కాంగ్రెస్ లోను ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోది.

గతంతో పోలిస్తే బిజెపి దూకుడు బాగా తగ్గడం,  బీఆర్ఎస్( BRS party ) ప్రభుత్వం పై వ్యతిరేకత జనాల్లో పెరగడం , ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న ధీమా తో ఉంది.అదే ధీమాతో పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తుంది.

బీ ఆర్ ఎస్ ,  బిజెపిలో కీలకంగా ఉన్న నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది.దీంతోపాటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని నిత్యం విమర్శలతో విరుచుకుపడుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అనే సంకేతాలను పంపించారు.

Telugu Congress, Dk Shivakumar, Revanth Reddy, Telangana, Ts, Ysrtp-Politics

 కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ( DK Shivakumar )కుటుంబంతో షర్మిల కుటుంబానికి స్నేహం ఉండడంతో,  షర్మిల కాంగ్రెస్ తో పొత్తు కోసం శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు  షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకునే కంటే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే వాదనను ఆయన తెరమీదకు తీసుకొస్తున్నారు.బీ ఆర్ ఎస్ ను ఎదుర్కోలేకే ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని,  బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం  ఉండడంతో,  ఆ అవకాశం ఇవ్వకుండా వైఎస్సార్  తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటే మంచిదనే వాదనను అధిష్టానం పెద్దల వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించారట.రేవంత్ రెడ్డి వాదనను కాంగ్రెస్ అగ్ర నాయకుల సైతం అంగీకరించినట్లు సమాచారం.

తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా పొత్తు ప్రతిపాదనలు కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తోందట.ఇటీవల డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కావడానికి కారణం కూడా ఇదేనట.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమా లేక విలీనం చేయడమా అనే విషయంలో షర్మిల కూడా సందిగ్ధం లో ఉన్నట్లు సమాచారం.వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSRTP )ని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని,  తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమెను ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందనే ప్రతిపాదనను రేవంత్ తెరపైకి తెస్తున్నారట.

Telugu Congress, Dk Shivakumar, Revanth Reddy, Telangana, Ts, Ysrtp-Politics

 అయితే ఈ విషయంలో షర్మిల అంత ఆసక్తిగా లేనట్టు సమాచారం.కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడం కంటే,  పొత్తు పెట్టుకోవడం ద్వారానే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో షర్మిల ఉన్నారట.దీనిపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీకి రావాలని నిర్ణయించుకున్న ఆమె డీకే శివకుమార్ తో పొత్తు పెట్టుకోవడమా, విలీనం చేయడమా అనే విషయాలపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది .మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube