టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balakrishna ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.
ఒక సినిమా ఇంకా పూర్తికాక ముందే మరొక సినిమా గ్రీన్ సిగ్నల్ వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు బాలకృష్ణ.ఇది ఇలా ఉంటే బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కాయి.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి.అందులో లెజెండ్ సినిమాలో( Legend Movie ) ఒక చిన్న పాపతో ఒక సన్నివేశం ఉంటుంది.ఆ సీన్లో బాలకృష్ణ ఆ పాప మెడలో చైన్ వేసి ఏదీ మామయ్యా అని పిలవమ్మా అని అంటాడు.
ఆ సీన్ సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది.సినిమాలో కంటే మీమ్స్ లో ఎక్కువగా చూసి ఉంటాం.అయితే ఆ చిన్నారి ఎవరో మీకు తెలుసా? ఆ పాప పేరు జోషిత.( Joshita ) ఆ పాప మరెవరో కాదు, చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) కూతురు.

బేబీ జోషిత తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.బోయపాటికి ముగ్గురు సంతానం కాగా ఆ ముగ్గురిలో జోషిత ఒకరు.ఇకపోతే బాలయ్య బాబు సినిమాల విషయానికొస్తే.ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు.
ఇందులో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.







