ఇండియాలో కొత్త డుకాటీ బైక్ రిలీజ్.. దాని ధరతో పెద్ద ఫ్లాట్ కొనేయొచ్చు!

ప్రీమియం బైక్స్ తయారీదారు డుకాటీ( Ducati ) తాజాగా భారతదేశంలో అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది.2023 పనిగలే వీ4 ఆర్ (2023 Panigale V4 R) పేరుతో విడుదలైన దీని ధరను కంపెనీ అక్షరాలా రూ.69,99,000గా నిర్ణయించింది.అంటే సుమారు రూ.70 లక్షల అని చెప్పుకోవచ్చు.ఇంత మొత్తం డబ్బులను వెచ్చిస్తే ఒక విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేయవచ్చు.

 Ducati Has Launched The 2023 Panigale V4 R At A Price Tag Of Rs 70 Lakh Details,-TeluguStop.com

లేదంటే ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు.అత్యంత లగ్జరీ కార్లు సైతం ఈ ప్రైస్ రేంజ్ లో లభిస్తాయి.అయితే ఒక బైక్ ధరను ఈ రేంజ్ లో డుకాటీ నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

2023 పనిగలే వీ4 ఆర్ అనేది డుకాటీ నుంచి అత్యంత ఖరీదైన బైక్ మాత్రమే కాకుండా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన బైక్ కూడా.ఈ బైక్ కార్బన్ వింగ్స్‌తో అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంది.“1” సంఖ్యతో తెల్లటి ప్లేట్‌లను కలిగి ఉన్న మోటోజీపీ-ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంది.ఇంత ధర పెట్టి కొనుగోలు చేసేవారు తక్కువ కాబట్టి డుకాటీ మొదటగా ఈ మోడల్ కు సంబంధించి ఐదు బైకులను మాత్రమే తయారు చేసింది.వీటి డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి.

Telugu Carbon, Ducati Bike, Powerful, Panigale, Panigale Bike-Latest News - Telu

2023 పనిగలే వీ4 ఆర్ మాడిఫైడ్ 998 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ R ఇంజన్‌తో వస్తుంది.ఇది ఆరవ గేర్‌లో గరిష్టంగా 16,500 rpm వేగాన్ని చేరుకోగలదు.218 hp పవర్ అవుట్‌పుట్‌ను అందించగలదు.రేసింగ్ అక్రాపోవిక్ ఎగ్జాస్ట్‌ని జోడిస్తే దాని పవర్ 237 hpకి చేరుకుంటుంది.

డుకాటి ఈ బైక్‌కు ఏరోడైనమిక్ మెరుగుదలలను కూడా చేసింది.

Telugu Carbon, Ducati Bike, Powerful, Panigale, Panigale Bike-Latest News - Telu

రైడర్ ఫీడ్‌బ్యాక్, గ్రిప్‌ని మెరుగుపరచడానికి, డుకాటీ ఛాసిస్‌లో మార్పులు చేసింది.ఫ్రంట్ ఫోర్క్, ఓహ్లిన్స్ NPX25/30, మునుపటి “R” మోడల్‌తో పోలిస్తే 5 mm పెంచింది.వెనుక ఎత్తు 20 మి.మీ పెంచింది.ఓహ్లిన్స్ TTX36 షాక్ అబ్జార్బర్‌ని కూడా జోడించింది మొత్తం మీద ఈ బైక్ చాలా పవర్‌ఫుల్, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైడ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube