భ్రమకి, వాస్తవానికి ఎంతో తేడా ఉంటుంది.కలలో మనం ఒంటిచేత్తో ఓ రాజ్యానికి రాజులు కాగలం.
కానీ నిజ జీవితంలో ఒక కుటుంబానికి హీరో కావడం చాలా కష్టతరం.ఇంకా మన చుట్టూ కొంతమంది భజనగాళ్ళు వుంటారు.
వారి వారి స్వలాభాలకోసం మనల్ని ఆకాశానికి ఎత్తేస్తూ వుంటారు.నువ్వు అందంగా వున్నావు సినిమాల్లో ట్రై చేయమని కొందరంటారు.
మనదగ్గర కాస్త డబ్బు ఎక్కువ ఉంటే మరికొంతమంది రాజకీయాల్లో ట్రై చేయమని సలహాలు ఇస్తూ వుంటారు.ఇలా చాలామంది మనకు సాధ్యం కానీ పనులను చేయమని ముందుకు తోస్తూ వుంటారు.
అయితే మనం ఏం చేయాలో మనకో క్లారిటీ ఉండాలి.లేదంటే ఇక్కడ మన్నడం కష్టం.
మన బలాలేమిటో తెలుసుకోకుండా రిస్కులు చేస్తే మిగిలేది శున్యమే.ఇపుడు ఇదే విషయం ఉక్రెయిన్ దేశం విషయంలో నిజమని తేలుతోంది.ఉక్రెయిన్ పరిస్థితి ఎలాగుందంటే… ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి మాదిరి తయారయ్యింది.రష్యాను ఓడించేంత శక్తి తమకి లేదని తెలిసినా కూడా ఎవరో సాయం చేస్తారని పరాయి దేశాలను నమ్మి ముందుకెళ్లి, రెండు చేతులు కాల్చుకుంది.
రష్యా లాంటి శక్తివంతమైన దేశంతో యుద్ధానికి కాలు దువ్వి తీవ్రంగా నష్టపోతుంది.ఎంతలాఅంటే బాగ్ పుత్ లాంటి నగరాన్ని రష్యా( Russia ) పూర్తిగా కైవసం చేసుకొనేవరకు వెళ్ళింది.
అణ్వస్త్ర దేశంతో యుద్ధం అంటే సామాన్యమైన విషయం కాదు.సంవత్సరం పైనే యుద్ధం కొనసాగుతున్నా రష్యా తన ఓపికను సమర్థవంతంగా ప్రదర్శిస్తుంది.ఒకవేళ రష్యా గనక అణ్వస్త్ర దాడి ( Nuclear attack )చేస్తే ఇక చెప్పడానికి మాటలు లేవు.యుద్ధం వల్ల ఈపాటికే ఎంతో నష్టపోయిన ఉక్రెయిన్, రష్యాను( Russia ) ఓడిస్తామని ఇంకా గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి చూసుకుంటే నాటో దేశాలను నమ్మిన ఉక్రెయిన్ కి బూడిద తప్ప ఇంకేమి మిగలలేదని తేటతెల్లం అవుతోంది.ఇకనైనా యుక్రెయిన్ తన తప్పుని తాను తెలుసుకొని యుద్ధం విరమిస్తే కనీసం మిగిలిన దేశం అయినా భద్రంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.