పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాగిస్తున్న వారాహి యాత్ర నేటితో ముగియనుంది.మళ్లీ రెండో దశ వారాహి యాత్ర ( Varahi Yatra )ఎప్పుడు అనేది వచ్చే నెలలో పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు లో వారాహి రెండవ దశ యాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది.కనుక పవన్ కళ్యాణ్ ఆ లోపు మళ్లీ సినిమా ల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో భాగంగా పలు నియోజక వర్గాలను కవర్ చేయడం జరిగింది.
ఇప్పుడు బ్రేక్ తీసుకుని కొత్తగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ ( OG ) షూట్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే వారం లో ఓజీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యి షూటింగ్ పార్ట్ మొత్తాన్ని కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి ఓజీ సినిమా యొక్క షూటింగ్ ను ఈ ఆగస్టు వరకు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకోసం పవన్ కాస్త ప్లాన్ గా షూటింగ్ డేట్స్ ను పెట్టుకున్నారు. బ్రో సినిమా ( Bro movie ) వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమా ల్లో పవన్ పాల్గొంటాడా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు.అయితే ఓజీ సినిమా షూటింగ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ డేట్స్ లో పాల్గొనడం ద్వారా వెంటనే షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆ తర్వాత హరి హర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh )సినిమా ల్లో కూడా పవన్ నటిస్తున్నాడు.వాటిని షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది.
పవన్ యొక్క జోరు మామూలుగా లేదు.ఆయన తీరు మరియు స్పీడ్ కు ఈ ఏడాది రెండు సినిమా లు మరియు వచ్చే ఏడాది రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతే కాకుండా వారాహి యాత్ర కూడా కంటిన్యూ గా సాగుతూనే ఉంటుంది.