వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్( YouTube ) ఈ నెలాఖరున దక్షిణ కొరియాలో తన మొదటి అధికారిక షాపింగ్ ఛానెల్‌ని ప్రారంభించనుంది.దాంతో సౌత్ కొరియా( South Korea ) అటువంటి ఛానెల్‌ని కలిగి ఉన్న మొదటి దేశంగా అవతరించనుంది.
ఈ ఛానెల్ వివిధ కంపెనీలకు తమ ప్రొడక్ట్స్‌ను లైవ్‌లో చూపిస్తూ సేల్ చేయడానికి వీలు కల్పిస్తుంది.తొలత ఈ ఛానల్ ద్వారా దాదాపు 30 బ్రాండ్‌ల ప్రొడక్ట్స్‌ను యూట్యూబ్ ప్రదర్శించనుంది.
ఇది వినియోగదారులకు షాపింగ్ కంటెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది.

ఇకపోతే యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో క్రమంగా షాపింగ్ ఫీచర్‌లను( YouTube Shopping ) ప్రవేశపెడుతోంది.గత సంవత్సరం, ఇది ఎక్స్‌ప్లోర్ విభాగంలో షాపింగ్ ట్యాబ్‌ను పరిచయం చేసింది.అర్హత కలిగిన క్రియేటర్స్ తమ లైవ్ స్ట్రీమ్‌లలో ఉత్పత్తులను ట్యాగ్ చేయడానికి లేదా వారి వీడియోల క్రింద ఉత్పత్తులను జాబితా చేయడానికి ఇది అనుమతిస్తుంది.
అప్పుడు వ్యూయర్స్ ఆ క్రియేటర్స్ నుంచి నేరుగా కొనుగోళ్లు చేయవచ్చు.యూట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్( Alphabet ) మరింత మంది క్రియేటర్స్, కంటెంట్, వ్యూయర్స్, ప్రకటనల అవకాశాలను ప్రోత్సహించడానికి యూట్యూబ్ ను మరింత షాపింగ్ ఫ్రెండ్లీ చేయడంపై దృష్టి సారించింది.

యూట్యూబ్ కొరియాలో బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజ్ చేయడం, అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.వివిధ షాపింగ్ ఫీచర్‌లతో ప్రయోగాలు కూడా చేయనుంది.నిర్దిష్ట వివరాలు అందించనప్పటికీ, యూట్యూబ్ తన వినియోగదారుల కోసం షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచాలని నిశ్చయించుకుంది.ఈ చర్య ఇ-కామర్స్( E Commerce ), లైవ్ స్ట్రీమింగ్‌ని ఏకీకృతం చేసే ప్రస్తుత ట్రెండ్‌తో సరితూగుతుంది.
వినియోగదారులు వారి ఇష్టమైన యూట్యూబ్ కంటెంట్‌ను ఆస్వాదిస్తూనే షాపింగ్ చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది.