ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ వి.పి గౌతమ్

ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి.

 Government Medical College Construction Work Should Be Speeded Up Collector Vp G-TeluguStop.com

గౌతమ్ అన్నారు.గురువారం కలెక్టర్, పాత కలెక్టరేట్ లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చేపడుతున్న పునర్నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.

టీచింగ్ గది, ఫిజియాలజి ల్యాబ్, హేమటాలజీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ, మ్యూజియం, లెక్చర్ హాల్, పరిపాలన కార్యాలయం తదితరాలను పరిశీలించారు.పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు.

పనులు వేగంగా జరుగుతున్నట్లు, ఈ నెలాఖరులోగా వైద్య కళాశాల కు సంబంధించి పనులు పూర్తికానున్నట్లు, హాస్టళ్లకు సంబంధించి పనులు జులై మొదటి వారంలోగా పూర్తి అవుతాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు.పనులు ప్రతిరోజూ జరగాలని, వర్కర్లను పెంచాలని, అనుకున్న సమయానికి పనుల పూర్తికి చేయాలని కలెక్టర్ అన్నారు.

కలెక్టర్ తనిఖీ సందర్భంగా వైద్యాధికారులు, పనుల నిర్వహణ కాంట్రాక్టర్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube