భారతదేశం సకల కళలు, సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది.భారతదేశపు గొప్ప చరిత్రను తెలియజేసే అనేక భవనాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.
భారతదేశంలో ఉన్న చాలా భవనాలు లేదా స్మారక చిహ్నాలు( Monuments ) దాదాపుగా పురుషులు నిర్మించినవే.కానీ స్త్రీలు నిర్మించిన కొన్ని భవనాలు మరియు స్మారక చిహ్నాలు ఇక్కడ కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అందులో మొదటగా చెప్పుకోదగ్గది “హుమాయున్ సమాధి, ఢిల్లీ.” ( Humayun Tomb ) ఢిల్లీలోని హుమాయున్ సమాధిని నిర్మించింది ఒక స్ర్తీ అని చాలామందికి తెలియదు.హుమాయూన్ భార్య హమీదా బాను బేగం దీనిని పర్షియన్, భారతీయ శైలిని మేళవించి నిర్మించింది.
ఇది ఎర్రరాతితో కట్టిన సమాధి.భారత ఉపఖండంలోనే మొదటి ఉద్యానవన సమాధి ఇదే.ఈ సమాధిని 16వ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది.

ఆ తరువాత చెప్పుకోదగ్గది “ఇత్మద్-ఉద్-దౌలా, ఆగ్రా.”( Itimad-Ul-Daulah ) ఆగ్రాలోని ఈ సమాధిని నూర్జహాన్ 17వ శతాబ్దంలో తన తండ్రి మీర్జా ఘియాస్ బేగ్ జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది.తాజ్ మహల్‌ను పోలి ఉన్నందున, దీనిని “బేబీ తాజ్ మహల్” అని కూడా అంటారు.
క్రీస్తుశకం 1625లో నిర్మించబడిన ఇత్మద్ ఉద్ దౌలా సమాధి, తాజ్ మహల్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది.ఇతిమద్-ఉద్-దౌలా సమాధి పాలరాతిలో వెండి ఆభరణాల పెట్టెను పోలి ఉంటుంది.
ఆ తరువాత ఇక్కడ “రాణి కి వావ్, పటాన్” ( Rani Ki Vav ) గురించి మాట్లాడుకోవాలి.గుజరాత్‌లోని పటాన్ నగరంలో ఉన్న ఈ మెట్ల బావిని 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి నిర్మించించారు.
రాణి ఉదయమతి చౌళుక్య రాజు అయిన భీమ I రాజు భార్య.ఆయన జ్జపాకార్థం ఈ సమాధిని నిర్మించారు.

తరువాత “విరూపాక్ష దేవాలయం, పట్టడకల్” అత్యంత విశేషత కలది.ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో కర్ణాటకలోని పట్టడకల్ పట్టణంలో రాణి లోకమహాదేవి నిర్మించారని ప్రతీతి.ఇది శివునికి అంకితం చేయబడింది.చాళుక్యుల నిర్మాణ శైలిని కలిగి వున్న అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది.లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య II పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించింది.ఇక చివరగా “లాల్ దర్వాజా మసీదు, జౌన్‌పూర్” గురించి చెప్పుకోవాలి.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఉన్న ఈ చారిత్రాత్మక మసీదును 1447లో సుల్తాన్ మహమూద్ షర్కీ రాణి రాజే బీబీ నిర్మించారు.ఇది ‘అతలాల మసీదు’ని పోలి ఉంటుంది.
ఈ మసీదు సెయింట్ సయ్యద్ అలీ దావూద్ కుతుబుద్దీన్‌కు అంకితం చేయబడింది.







