రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.జిల్లాలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరించారు.
దేవాలయాల్లో వేద పారాయణం మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆధ్యాత్మిక దినోత్సవంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
స్వపరిపాలనలో తెలంగాణ సొంత అస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని అతిథులు, భక్తులు , ప్రజలు పేర్కొన్నారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.







