మహిళలలో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువో తెలుసా..?

ఆర్థరైటిస్( Arthritis ) కీళ్ల వాపుతో కూడిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్య.ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మంది వ్యక్తులను ప్రభావితం చేస్తూ ఉంది.

 Do You Know Why Women Are More Prone To Arthritis , Arthritis, Estrogen, Immune-TeluguStop.com

పురుషులతో పోలిస్తే మహిళలు ఆర్థరైటిస్ తో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చాలా రకాల అంశాలు మహిళలలో ఆర్థరైటిస్ సమస్య పెరగడానికి కారణం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఎవరికైనా ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.అయితే మగవారి కంటే మహిళలలో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు చెబుతున్నారు.

Telugu Arthritis, Estrogen, Genetic, Tips, Immune System-Telugu Health

మగవారి కంటే మహిళలు ఆర్థరైటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండడానికి హార్మోన్లలో ఏర్పడే హెచ్చు తగ్గులే ప్రధాన కారణమని చెబుతున్నారు.మహిళలలో ఈస్ట్రోజన్( Estrogen ) స్థాయిలో ఎక్కువగా ఉంటాయి.ఇది కీళ్ల వాపుకు కారణమవుతుంది.కీళ్ల ఎముకల మధ్య కుషన్ గా పనిచేసే మృదులాస్తి కూడా ఈస్ట్రోజెన్ కారణంగా దెబ్బతింటుంది.స్త్రీలు ఆర్థరైటిస్ కు గురి అయ్యే అవకాశం ఎందుకు ఎక్కువ అనే విషయంలో ప్రధానంగా ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కారణమని వైద్యులు చెబుతున్నారు.

Telugu Arthritis, Estrogen, Genetic, Tips, Immune System-Telugu Health

రోగనిరోధక వ్యవస్థకు( immune system ) మాడ్యులేట్ చేయడంలో, ఇన్ఫ్లమేషన్ స్థాయిలను ప్రభావితం చేయడంలో ఋతుస్రావం, గర్భం ఋతువు విరాతి సమయంలో మహిళల యొక్క హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఆర్థరైటిస్ తీవ్రతరం కావాడనికి కారణమవుతాయి.హార్మోన్లు ఆర్థరైటిస్ మధ్య సంక్లిష్ట సంబంధం పై పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు.అలాగే ఒక వ్యక్తి ఆర్థరైటిస్ కు గురికావటానికి జన్యుపరమైన కారకాలు కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కొన్ని జన్యుపరమైన వైవిధ్యాలు, ఉత్పరివర్తనాలు ( Genetic Variations, Mutations )మహిళలలో ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక రకాల ఆర్థరైటిస్ లు ఆటో ఇమ్యూన్ వ్యాధులుగా వర్గీకరించబడ్డాయి.

రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలపై పొరపాటున దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏర్పడుతాయి.మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.పురుషులతో పోలిస్తే మహిళలలో స్వయం ప్రతి రక్షక వ్యాధుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది.దీనీ ఫలితంగా రోగనిరోధక ప్రతిస్పందనలలో వ్యత్యాసాలు రోగనిరోధక నియంత్రణకు సంబంధించిన జన్యుపరమైన కారకాలు మహిళల్లో ఆర్థరైటిస్‌ సమస్య అధికంగా ఉండడానికి కారణమని వైద్య నిపుణులు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube