కరోనా పుణ్యమా అని ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.అప్పటి నుండి ఓటిటి కంటెంట్ కూడా పెరిగి పోయింది.
ఓటిటిలో కంటెంట్ ను ప్రేక్షకులను బాగా ఆదరిస్తున్నారు.దీంతో వారికీ డిమాండ్ పెరగడంతో ఓటిటిలో( OTT ) నటించేందుకు స్టార్ హీరోయిన్స్ సైతం వెనుకాడడం లేదు.
వరుసగా స్టార్ హీరోయిన్స్ ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను చేస్తున్నారు.

అయితే వెండితెరపై స్టార్ హీరోలతో నటించినప్పుడు కూడా గ్లామర్ అంతగా చూపించని ముగ్గురు భామలు ఇప్పుడు ఓటిటిలో మాత్రం శృతి మించుతున్నారు.వెండి తెరపై మడికట్టుకుని కూర్చున్న ముద్దుగుమ్మలు సైతం ఓటిటిలో దుమ్ములేపేస్తున్నారు.వారి అందాలకు సెన్సార్ కూడా లేకపోవడంతో ఈ భామలు మరింత రెచ్చిపోతున్నారు.
వెండి తెరపై పరిమితులను పెట్టుకున్న ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు వెబ్ సిరీస్( Web series ) లలో రెచ్చిపోయి మరీ అందాలను చూపించడం, బోల్డ్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం ఫ్యాన్స్ కు మింగుడుపడడం లేదు.మరి ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే.
తమన్నా, సమంత, నిత్యామీనన్( Tamanna, Samantha, Nithya Menon ).వీరిలో తమన్నా, సమంత అయిన వెండితెరపై అందాలను బాగానే ఆరబోశారు.

కానీ నిత్యా మీనన్ మాత్రం పరిమితులను పెట్టుకుని కంటెంట్, తన పాత్ర ప్రాధాన్యతను చూసి సెలెక్టివ్ గా సినిమాలు చేసేది.మరి అలాంటి వాటికీ దూరంగా ఉంటూ వస్తున్న ఈ భామ ఏకంగా లిప్ లాక్ సీన్ లో నటించడం పెద్ద షాక్.అలాగే సామ్ ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో పాటు ఇప్పుడు సిటాడెల్ కూడా చేస్తుంది.ఇందులో కూడా బోల్డ్ సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఇక తమన్నా ఇప్పటి వరకు చాలా పరిమితులతో నటించింది.కానీ ఇప్పుడు ఓటిటిలో వాటిని చెరిపేసినట్టు తెలుస్తుంది.
దీంతో ఓటిటి – వెబ్ సిరీస్ లు అంటూ వచ్చి హద్దులు దాటి నటిస్తున్న వారు కొందరైతే ఎక్కడైనా అలాగే అనేవారు మరికొందరు.







