గూగుల్ యూజర్లకు చేదు వార్త... ఇకనుండి ఆ సేవలు నిలిపివేయబడతాయి?

అవును, మీరు విన్నది నిజమే.టెక్ దిగ్గజం గూగుల్( Google ) అనవసరమైన ప్రొడక్ట్స్ తొలగిస్తూ ఉన్న సేవలను ఇంకాస్త మెరుగు పరిచే పనిలో పడింది.

 Google To Discontinue Album Archive Services Details, Google, Bad News, Technolo-TeluguStop.com

ఇందులో భాగంగా చాలా సేవలను తొలగించిన సంగతి అందరికీ విదితమే.అయితే ఇప్పుడు మాత్రం యూజర్లకు అత్యంత యూజ్‌ఫుల్ సర్వీస్ అయిన గూగుల్ ఆల్బమ్ అర్కైవ్( Google Album Archives ) సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ టూల్‌తో యూజర్లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అందువల్లనే గూగుల్ దీనిని ఎందుకు తొలగించాలని అనుకుంటోందో ఇంకా తెలిసిరాలేదు.

పర్సనల్ మీడియా సేవ్ చేయడానికి, వాటిని చక్కగా మేనేజ్ చేయడానికి ఆల్బమ్ అర్కైవ్ టూల్( Album Archive Tool ) బాగా దోహదపడుతుంది.

Telugu Album Archive, Bad, Google, Google Album, Ups-Latest News - Telugu

కానీ, వచ్చే నెల అంటే జులై 19 నుంచి ఈ టూల్ అందుబాటులో ఉండదని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కాకుండా సురక్షితమైన చోట పర్సనల్ డేటాను బ్యాకప్ స్టోర్ చేయాలని యూజర్లను ప్రోత్సహించేలా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందని భోగట్టా.గతంలో గూగుల్+ లాంటి పలు పాపులర్ గూగుల్ యాప్స్‌ ఉండేవి.

వాటిలో సంవత్సరాల తరబడి షేర్ చేసిన మీడియా కంటెంట్స్‌ను భద్రపరచుకోవడానికి యూజర్లు ఆల్బమ్ అర్కైవ్నే వాడుకొనేవారు.అలా సేవ్ చేసుకున్న విలువైన డేటాను 2023, జులై 19లోగా గూగుల్ టేక్‌అవుట్ వినియోగించి డౌన్‌లోడ్ చేసుకోవాలని గూగుల్ ఇప్పుడు ఈ-మెయిల్స్ ద్వారా సూచిస్తోంది.

Telugu Album Archive, Bad, Google, Google Album, Ups-Latest News - Telugu

ఇకపోతే జులై 19 తర్వాత యూజర్ల డేటా అందులో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మీరు సేవ్ చేసుకున్న మీడియా కంటెంట్‌ను గడువు తేదీలోగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం.ఆల్బమ్ అర్కైవ్ షట్ డౌన్ చేయడం వల్ల హ్యాంగౌట్ చాట్స్‌, 2018కి ముందు జీమెయిల్‌లో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లు, ఆల్బమ్ కామెంట్స్, లైక్స్ వంటి కంటెంట్‌ కూడా డిలీట్ కాబోతోంది.గూగుల్ ఆల్బమ్ అర్కైవ్ డేటాలో ఫొటోలు, వీడియోలు ఒక గ్యాలరీ లాగా కనిపిస్తాయి.వీటి కోసం డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.లేదంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్, వన్‌డ్రైవ్ వంటి ఇతర క్లౌడ్ సేవలకు కంటెంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.ఆల్బమ్ అర్కైవ్ డేటా గురించిన మరిన్ని వివరాలను దాని సపోర్ట్ పేజీ నుంచి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube