మెగా కుటుంబం ( Mega Family )ప్రస్తుతం సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.మెగా కుటుంబంలోకి మూడో తరం వారసురాలు అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇలా మెగా వారసురాలు రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా మహాలక్ష్మి పుట్టింది అంటూ పెద్ద ఎత్తున రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇలా మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్ కి చేరుకొని చిన్నారిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిన్నారి ముగ్గురు మేనత్తలు కూడా అపోలో హాస్పిటల్ కు చేరుకొని తమ మేనకోడల్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.ఇలా మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం రెట్టింపు అయింది.ఇక సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ( Ram charan ) బాబాయ్, మెగా ప్రిన్సెస్ కు చిన్న తాత అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సైతం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన (Upasana)దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో( Varahi Yatra) బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసనలకు కూతురు జన్మించారనే విషయం తెలియగానే ఈయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమ పూర్వక శుభాకాంక్షలు… శుభాశీస్సులు అంటూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







