యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే.హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా సినిమా ను అధ్బుతమైన విజువల్ వండర్ గా దర్శకుడు నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రాజెక్ట్ కే సినిమా అనేది ఒక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ అనే విషయం తెల్సిందే.సినిమా లో ఉండే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కూడా సర్ ప్రైజ్ చేస్తాయట.
ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ సినిమా లో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆకట్టుకునే విధంగా ప్రాజెక్ట్ కే సినిమా( Project K ) కథ మరియు కథనం ఉంటుందనే నమ్మకం ను యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమా లో గెస్ట్ రోల్ లో కమల్ హాసన్( Kamal Haasan ) నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు.
అయితే సినిమా లో చిన్న పాత్ర లో కమల్ హాసన్ నటించడం అనేది వాస్తవం.అశ్వినీదత్ తో కమల్ కి ఉన్న సన్నిహిత్యం కారణంగా నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా లో నటించేందుకు గాను కమల్ హాసన్ కు వంద కోట్ల పారితోషికం ను ఇవ్వడం జరుగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అది నిజం కాదని చాలా మంది చెబుతున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమా లో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్( Amitab Bachchan ), దీపికా పదుకునే.దిశా పటానీ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఉన్నారు.అంత మంది ఉండగా కమల్ హాసన్ కు గెస్ట్ రోల్ లో నటించేందుకు గాను వంద కోట్లు ఇవ్వబోతున్నారు అంటూ ఏమాత్రం నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఉన్న ఈ ప్రచారం లో వాస్తవం లేదు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







