ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్( Social Media Platforms )లలో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది.ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్ కంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువగా యువత గడుపుతున్నారు.ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడంతో పాటు తమకు నచ్చిన సెలబ్రెటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.
అలాగే రీల్స్ పోస్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు ఇతరుల చేసే రీల్స్ ను కూడా చూస్తున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్( Instagram ) ద్వారా బాగా ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు.ఈ విషయం చాలామందికి తెలియదు.రీల్స్ ద్వారా బోల్డెంత డబ్బులు ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చు.
చాలామంది రీల్స్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు.అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఇక సెలబ్రెటీలైతే రూ.కోట్లు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.విరాట్ కోహ్లీ( Virat Kohli )కి అయితే ఒక్క పోస్ట్‌కే రూ.9 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.ఇన్‌స్టాగ్రామ్ నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఇండియలో ఆ సంఖ్య దాదాపు 32 కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు.దీంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుునేందుకు చాలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తోన్నాయి.

ఈ కామర్స్ కంపెనీలు ఎక్కువగా సోషల్ మీడియాలోనే అడ్వర్ట్రైజ్‌మెంట్స్( Ads in Instagram ) ఇస్తున్నాయి.అలాగే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు వ్యక్తిగతంగా కూడా యాడ్స్ వస్తున్నాయి.దీంతో యూజర్లు( Instagram Users ) ఎక్కువగా ఉన్నవారికి సైడ్ ఇన్‌కమ్ చాలా బాగా వస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ మీ బ్రాండ్ గుర్తింపును పెంచడంతో పాటు ప్రేక్షకులకు త్వరగా చేరువ చేయడంతో ఉపయోగపడుతుంది.అలాగే అమ్మకాలను కూడా త్వరగా పెంచుకోని లాభాలను తెచ్చుకోవచ్చు.ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ ద్వారానే వ్యాపారం నడుస్తోంది.దీంతో డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా విస్తరించింది.
ఆన్‌లైన్ అడ్వర్ట్రైజ్‌మెంట్స్ ద్వారా మన కంపెనీ లేదా ప్రొడక్ట్స్‌ను సులువుగా ప్రజలకు తెలియజేయవచ్చు.







