నందమూరి కళ్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram )హీరోగా చాలా సినిమాలు చేసాడు.వీళ్ళ కుటుంభం నుంచి ఈ తరం హీరోల్లో మంచి పేరు సంపాదించుకున్న వాళ్లలో జూనియర్ ఎన్టీయార్ ఒకరైతే మరోకరు కళ్యాణ్ రామ్…మొదట్లో కళ్యాణ్ రామ్ ని నందమూరి ఫ్యామిలీ బాగా ప్రమోట్ చేసినప్పటికీ ఆయన సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు.
దాంతో కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోలేదు.
కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన బింబిసారా( Bimbisara ) సినిమాతో ఈయన ఒక్కసారిగా నందమూరి హీరో అంటే ఇలాగే ఉంటాడు అని అందరితో అనిపించుకున్నాడు.
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అందులో ఈయన నటించిన కొన్ని సినిమాలు మాత్రమే మంచి హిట్ ఇచ్చాయి.అయితే ఈ విషయం పక్కన పెడితే నందమూరి కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ అంతగా సక్సెస్ అవనప్పటికీ పర్సనల్ కెరియర్ లో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు.

ఈయన స్వాతి( Swati ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇక వీళ్లిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమే.ఈ జంటకు ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు.ఇక పెళ్లయినప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.అలాగే స్వాతి కళ్యాణ్ రామ్ కి సంబంధించిన అన్ని విషయాలలో తోడునీడగా ఉంటుంది.అయితే అలాంటి స్వాతి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

అదేంటంటే స్వాతి పెళ్లి కాకముందే మరో హీరోకి వీరాభిమానట.ఆ అభిమానంతో కాలేజీ రోజుల్లోనే గోడ దూకి అలాంటి పనులు చేసిందట.ఇక ఆ హీరో ఎవరో కాదు మన్మధుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున అంటే స్వాతికి చాలా ఇష్టమట.ఆయన నటించిన మన్మధుడు సినిమా ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదట.
అలాగే కాలేజీ రోజుల్లో నాగార్జున కొత్త సినిమా రిలీజ్ అయితే గోడ దూకి మరీ కాలేజీకి బంకు కొట్టి థియేటర్ కి వెళ్లి సినిమా చూసేదట.ప్రస్తుతం ఆమె ఇంట్లో హౌజ్ వైఫ్ గా ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది.








