రాకేష్ మాస్టర్ మరణానికి అదే కారణం... అసలు నిజం బయటపెట్టిన రాకేష్ మాస్టర్ సోదరుడు!

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ( Rakesh Master ) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన మరణానికి గల కారణం ఈయన ఓ కార్యక్రమం నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి రావడంతో వడదెబ్బ కారణంగా రక్త విరోచనాలు కావడంతో హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉండగా మరణించారని తెలుస్తుంది.

 That's The Reason For Rakesh Master's Death, Dehydration, Rakesh Master, Jaundic-TeluguStop.com

అయితే రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణాన్ని ఆయన సోదరుడు తెలియజేశారు.ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ సోదరుడు మాట్లాడుతూ రాకేష్ చనిపోవడానికి ఆయన సేవించిన మద్యం కారణమని వార్తలు వస్తున్నాయి.

Telugu Rakesh Master, Rakeshmaster-Movie

ఇలా రాకేష్ మాస్టర్ మరణించడానికి అది కూడా కారణమేనని ఆయన తెలియజేశారు.విజయనగరం షూటింగ్ వెళ్లినటువంటి రాకేష్ మాస్టర్ అక్కడ ఎక్కువగా శ్రమ పడటమే కాకుండా సరిగా ఆహారం తీసుకోవడం లేదు.అలాగే కారులో ప్రయాణం చేయడం వల్ల డిహైడ్రేషన్( Dehydration ) కి గురయ్యారని తెలియజేశారు.ఇక హైదరాబాద్ ( Hyderabad )వస్తుందనగా తనకు ఫోన్ చేసి సింహం హైదరాబాద్ వస్తుందన్న అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే త్వరలోనే తన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండబోతున్నానని రాకేష్ మాస్టర్ తనకు తెలియజేశారట.ఈ క్రమంలోనే ఆశమానికి వచ్చి తన ఆశీర్వాదం తీసుకొని రూమ్ కి వెళ్ళిన రెండు రోజులకు తనకు పూర్తిగా ఆరోగ్యం చెడిపోయిందని తెలిపారు.

Telugu Rakesh Master, Rakeshmaster-Movie

తనకు వాంతులు అవుతున్నాయని చెప్పగా వెళ్లి మెడిసిన్స్ ఇచ్చి వచ్చాను అయితే గతంలో తనకు ఒకసారి జాండీస్ వచ్చాయని ఆ జాండీస్ తిరిగి మరీ వచ్చాయేమోనని సందేహం తనకు వచ్చిందని తెలిపారు.ఇక గతంలో చాలామంది యూట్యూబర్స్( YouTubers ) తనకు మద్యం తాపించి సెలబ్రిటీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడించేవారని చెబుతూ ఈయన ఎమోషనల్ అయ్యారు.ఇంకా చనిపోవడానికి కొన్ని గంటల ముందు తానే అన్నం తినిపించాలని వెళ్లగా రాకేష్ ఆ చేతన స్థితిలో పడి ఉన్నారని తనకు అన్నం తినిపించబోతే నోటి వెంట రక్తం రావడంతో వెంటనే ఆంబులెన్స్ కు ఫోన్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.అయితే ఆ సమయంలో రాకేష్ నన్ను ఎలాగైనా కాపాడండి నన్ను బ్రతికించండి రా అంటూ ఆవేదన వ్యక్తం చేశారనీ తన సోదరుడు రాకేష్ మాస్టర్ మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube