ప్రతీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తూ ఉంటాయి.అందుకే ఆ కాంబోస్ అంటే ప్రేక్షకులు మరింత ఎగ్జైట్మెంట్ గా ఉంటారు.
మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సూపర్ హిట్ కాంబోలు చాలానే ఉన్నాయి.ఈ కాంబోల్లో సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కు చేరుకుంటాయి.
ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో( Kollywood ) కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి.వాటిల్లో ఇళయ థలా అజిత్ కుమార్( Ajith Kumar ) అండ్ స్టార్ డైరెక్టర్ శివ( Director Siva ) కాంబో ఒకటి.
ఈ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి.మరి ఈ సాలిడ్ కాంబో మరోసారి కూడా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.

అజిత్ కుమార్ ఈ ఏడాది ‘తునివు’ సినిమాతో( Tunivu Movie ) వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తెగింపు గా తెలుగులో రిలీజ్ చేసారు.ఇక్కడ కూడా కలెక్షన్స్ బాగానే రాబట్టింది.
ప్రస్తుతం అజిత్ తిరుమేని దర్శకత్వంలో ”విడాముయర్చి” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ లైనప్ సెట్ చేసుకుంటున్న అజిత్ నెక్స్ట్ మూవీ గురించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

అజిత్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివతో మరో సినిమా చేయబోతున్న కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.వీరమ్, వివేకం, విశ్వాసం సహా పలు భారీ హిట్స్ అందుకున్న ఈ సెన్సేషనల్ కాంబో రిపీట్ అవుతుందంటే కోలీవుడ్ లో అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.శివ ప్రస్తుతం సూర్యతో కంగువ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత దీనిపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







