లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ నిర్ణయం.. 10 సినిమాల తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) ఒకరు.ఈ యంగ్ డైరెక్టర్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తీసిన ప్రతీ సినిమాను సూపర్ హిట్ చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు.

 Lokesh Kanagaraj Good Bye To The Industry After 10 Films, Thalapathy Vijay, Tris-TeluguStop.com

వరుస సక్సెస్ లలతో దూసుకు పోతున్న ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ లో మాస్టర్, ఖైదీ, కమల్ తో విక్రమ్ సినిమాలు తీసి హ్యాట్రిక్స్ సక్సెస్ లను అందుకున్నాడు.

మూడు కూడా కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి.తన యూనివర్స్ లో ఒక సినిమాను మరో సినిమాకు లింక్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.మరి ఇప్పుడు ఈ డైరెక్టర్ ఇళయ దళపతి విజయ్( Ilayathalapathy Vijay ) తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

మాస్టర్ తర్వాత మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం వీరి కాంబోలో ‘లియో'( Leo ) సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోందని సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా విజయ్ పుట్టిన రోజు( Vijay Birthday ) సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఈయన మాట్లాడుతూ.ఒక 10 సినిమాల వరకు తన సినిమాటిక్ యూనివర్స్ లో చేస్తానని.ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు.

ఈయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇక విజయ్ తో మరోసారి లియో కోసం వర్క్ చేయడం సంతోషంగా ఉందని.

ఇప్పటి వరకు తనతో వర్క్ చేసిన అందరికి ప్రత్యేకంగా థాంక్స్ అంటూ తెలిపారు.ఇక ఇప్పుడు విజయ్ తో చేస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube