శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిన్నారావుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.మంటలను అదుపు చేయబోయిన వృద్ధ దంపతులు కన్నుమూశారు.
గ్రామానికి సమీపంలో ఉన్న నీలగిరి తోటలో చెత్తను తగుల బెడుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో పొగలో చిక్కుకున్న దంపతులు ఊపిరి ఆడక మరణించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







