నాటు నాటు సాంగ్ లో ఏముంది.. కీరవాణి సొంతట్యూన్ కాదు.. సింగర్ సంచలన వ్యాఖ్యలు!

ఆర్.ఆర్.ఆర్ ( R.R.R )సినిమాలోని నాటు నాటు సాంగ్( Natu Natu Song ) కు ఆస్కార్ అవార్డ్ రావడం గురించి అప్పట్లో జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.నాటు నాటు సాంగ్ తన టాప్ సాంగ్ కాదని సంగీత దర్శకుడు కీరవాణి( Director Keeravani ) సైతం అంగీకరించారు.

 Lr Eshwari Shocking Comments Details Here Goes Viral In Social Media , Natu Natu-TeluguStop.com

ఈ సాంగ్ కు సంబంధించి వచ్చే విమర్శలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి.ప్రముఖ సింగర్ ఎల్.ఆర్.ఈశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడున్న సింగర్స్ పేర్లు నాకు తెలియదని ఎల్.ఆర్.ఈశ్వరి( LR Iswari ) అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ తెలుసని చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేశారని ఆమె తెలిపారు.

నాటు నాటు సాంగ్ పాటా అది అంటూ ఆమె కామెంట్లు చేశారు.నాటు నాటు సాంగ్ జానపద గీతం అని ఆమె తెలిపారు.

చరణ్, ఎన్టీఆర్ స్పీడ్ గా ఆడారని పాట ఏమీలేదని ఎల్.ఆర్.ఈశ్వరి అన్నారు.పొలాల వెంట ఆ పాట పాడేవారని ఆమె తెలిపారు.

బాగా పాటలు వినేవాళ్లకు ఆ విషయం తెలుసని ఎల్.ఆర్.ఈశ్వరి అన్నారు. చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ బాగుండటం వల్లే ఆస్కార్ ఇచ్చారని ఆమె తెలిపారు.

కీరవాణి గారు సొంత ట్యూన్ అని చెప్పగలరా అని ఆమె కామెంట్లు చేశారు.వాణీ జయరాం బాత్ రూమ్ కు వెళ్లి కింద పడ్డారని ఎల్.ఆర్.ఈశ్వరి అన్నారు.ఆమె ఎవరీకీ దత్తత తీసుకోలేదని ఆమె కామెంట్లు చేశారు.ఆమె తల్లీదండ్రులకు మొత్తం తొమ్మిది మంది సంతానం అని ఆమె చెప్పుకొచ్చారు.వాణీ జయరాం మంచి వ్యక్తి అని ఎల్.ఆర్.ఈశ్వరి వెల్లడించారు.నాకు మరీ భారీ స్థాయిలో ఆస్తులు అయితే లేవని ఆమె తెలిపారు.

ఆస్తులు పెట్టుకుని ఏం చేస్తానని ఎల్.ఆర్.ఈశ్వరి చెప్పుకొచ్చారు.ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube