ఈ రోజు ఫాదర్స్ డే అనే విషయం అందరికి తెలుసు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ తండ్రికి విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కూతురు సితార ఘట్టమనేని( Sitara Ghattamaneni ) కూడా ఫాథర్స్ డే సందర్భంగా మహేష్ కు విషెష్ చెబుతూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది.సితార మహేష్ తో దిగిన పిక్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి.”నా సూపర్ డాడ్ నా చీర్ లీడర్.మా నాన్నకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు( Happy Father’s Day ) తెలుపుతున్నానని పోస్ట్ పెట్టింది.
ఈ పిక్స్ లో మహేష్ బాబు, సితార ఒకరిని ఒకరు హగ్ చేసుకుని తమ సమయాన్ని హ్యాపీగా గడుపు తున్నారు.ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక మహేష్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా షూట్ గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు.వారితో హ్యాపీ మూమెంట్స్ ను పదిలంగా దాచుకుంటున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ”గుంటూరు కారం” సినిమాను చేస్తున్నాడు.కాగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







