మామూలుగా సెలబ్రిటీల ఇల్లు ఎలా ఉంటాయి చెప్పండి లక్సరీ బంగ్లాలు ఖరీదైన జిల్లాలు ఆ ఇంటి ముందు కోట్ల విలువ చేసే కార్లు ఒకటి కాదండోయ్… నాలుగైదు రకాల బ్రాండ్స్ కార్లని మెయింటైన్ చేస్తూ ఉంటారు.అలాంటి ఇంట్లో అడుగు పెడితే చాలు ఇంద్ర భవనంలోకి వెళ్ళినట్టే ఉంటుంది.
ఏమాత్రం స్టార్ డం వచ్చినా స్టార్ అయితే చాలు ఇలాంటి ఇండ్లనే మెయింటైన్ చేస్తూ ఉంటారు మరి ఎన్నో సినిమాలు తీసి చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ( Director Teja ) ఇంటి ముందు మాత్రం ఆ ఒకటి ఎప్పటికీ ఉండదట.అది ఏంటి ? ఎందుకు దర్శకుడు తేజ దాని ఇంటి ముందు పెట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు విషయంలోకి వెళితే దర్శకుడు తేజ ఎన్నో విలువలతో కూడిన వ్యక్తి.రాంగోపాల్ వర్మ శిష్యరికం చేసిన కారణమో లేదా మరే కారణమో తెలియదు కానీ అతను చెప్పే ఏ విషయం అయినా ముక్కుసూటిగా ఉంటుంది.దాదాపు వర్మ శిష్యులు అందరు ఇలాగే ఉంటారు.డబ్బుకు విలువ ఇవ్వరు, స్టార్డం అనే పదాన్ని దగ్గరికి కూడా రానివ్వరు.చాలా సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడతారు తేజ కూడా అందుకు మినహాయింపు కాదు.తేజ చాలా కోట్ల విలువ చేసే బంగ్లాలో ఉండడు.
అందరిలాగే మామూలు మధ్య తరగతి ఇంట్లోనే ఉంటాడు.అలాగే అతను ఇంటి ముందు పార్కింగ్ స్థలం) Parking Place ) కూడా ఉండదంటే నమ్మండి.
ఇంటర్వ్యూలో తన ఇంటి ముందు ఎందుకు పార్కింగ్ పెట్టుకోలేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు తేజ.

తన ఇంటి ముందు ఎప్పటికీ పార్కింగ్ ఉండదట.అలాగే తనకు ఉండే ఒకటి లేదా రెండు కార్లు రోడ్డు పక్కనే పార్కింగ్ చేసుకుంటాడట.బెంజ్ కార్లో వస్తే నమస్తే చెప్తారు కానీ ఆటోలో వస్తే చెప్పరా.? అలాంటప్పుడు ఆ నమస్కారం నాకు వర్తించదు నా బెంజ్ కారుకే పెట్టినట్టు.అందుకే నేను కార్లను, స్టేటస్ ను నమ్మను.
సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతాను.డబ్బుకు విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో నాలా ఉండే వారికి విలువ లేకపోయినా పరవాలేదు అంటూ కుండబద్దలు కొట్టేశాడు తేజ.







