వేములవాడ : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.వేములవాడ రాజన్న సన్నిధిలో శనివారం కోడెమొక్కులు చెల్లించుకుని ఆ నందీశ్వరుడి సాక్షిగా.
మనసున మనసై అని పాడుకుంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు.వారిలో ఒకరు హిజ్రా అయితే.
ఇంకొకరు ఓ యువకుడు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాను.
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది.
డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.తాజాగా పింకీ, శీనుల వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఇటీవల ఇలాంటి వివాహమే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) కి రైలులో పరిచయం ఏర్పడింది.
ఇది కాస్త ప్రేమగా మారింది.రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు……
.