కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా భారీ ఎత్తున తీస్తారు ఏదో సినిమా తీస్తున్నట్లు, ఆల్బమ్ సాంగ్ చేస్తున్నట్లు హడావుడి చేస్తూ ఉంటారు ఈ మాట మేం అనడం లేదు.ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో దీని గురించే చర్చ.
మీరు సోషల్ మీడియాలో ఉన్నా, పరిచయం ఉన్నా మేం దేని గురించి చెబుతున్నామో మీకు అర్థమైపోతుంది.అవును.
అదే ‘అర్జున్ లీల’.( Arjun Leela ) ఆహా ఓటీటీ ( Aha ) వాళ్లు ఘనంగా విడుదల చేసిన ఓ వీడియో.
అదేంటి మేమూ చేశాం అది యాడ్ కదా అంటారా?
ఇప్పుడు లైన్‌లోకి వచ్చారు.మీరే చెప్పండి ఆ వీడియో చూశారు కదా.అచ్చంగా ‘ఆహా’ ఓటీటీ ప్రచారం కోసం చేసిన ఓ యాడ్ అది.ఆ ఓటీటీలో ఏమున్నాయ్, ఏం చూపిస్తారు, ఎలాంటివి చూపిస్తారు అని చెప్పడానికి చేసిన చిన్న ప్రోమో అది.చూడటానికి చాలా బాగుంది.కామెడీగా, హీరోయిక్‌గా భలే తీశారు.
అయినా దాని గురించి రివ్యూ చెప్పడం ఏంటి? అయినా యాడ్‌కి ఎవరైనా రివ్యూ చెబుతారా ఏంటి? అయితే ఇక్కడ ఎందుకు చెబుతున్నాం అంటే.దీనిని ఓ పెద్ద సినిమా రేంజిలో బిల్డప్ ఇచ్చారు మరి…

గత కొన్ని రోజులుగా ఆహా ట్విటర్ పేజీలో పెద్ద పబ్లిసిటీ చేశారు… అంటూ పెద్ద ప్రచారమే చేశారు.ఆహా ఒరిజినల్ ప్రొడక్షన్ నెం 1 అంటూ అదేదో సినిమా రేంజిలో కలరింగ్ ఇచ్చారు.నిజానికి ఇది ప్రొడక్షన్ నెం 1 కాదు.
ప్రొడక్షన్ నెం 3.గతంలో ఆహా గురించి అల్లు అర్జున్( Allu Arjun ) రెండు యాడ్‌లు చేశాడు.ఒక యాడ్ కేతిక శర్మతో అయితే, రెండో యాడ్ సినిమాపురం అంటూ చేశాడు.మరి ఎందుకు దీనిని ఫస్ట్ అన్నారో వాళ్లకే తెలియాలి.

అయినా తెలుగు హీరోలు యాడ్‌లు చేయడం కొత్తం కాదు.అందులోనూ బన్నీకి ఇంకా కొత్త కాదు.వాటికి త్రివిక్రమ్ డైరెక్షన్ చేయడమూ కొత్త కాదు.మరి ఏదో తొలిసారి అయినట్లు ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చారు అనేది వాళ్లే చెప్పాలి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ మధ్య అల్లు అర్జున్ ప్రతిదానికీ చాలా హడావిడి చేస్తున్నారు అంటూ చాలా కామెంట్లు చేస్తున్నారు…
.







