ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ ( YS Jagan Mohan Reddy )దృఢ సంకల్పంతో ఉన్నారు.గెలుపే లక్ష్యంగా అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఎమ్మేల్యేలు, ఎంపీలు, పార్టీ కన్వీనర్లు, నియోజిక వర్గ ఇంచార్జ్ లు.ఇలా అందరిని యాక్టివ్ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.ఆ కోవాలోనే వైఎస్ జగన్ “ గడప గడపకు మన ప్రభుత్వం( Gadapa Gadapa Ku Mana Prabutvam ) ” కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న ఎమ్మేల్యేలు, పార్టీ ప్రతినిధులు నియోజిక వర్గంలోని ప్రతి గ్రామం తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, జగన్ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించాల్సి ఉంటుంది.

ఇప్పటికే అన్నీ నియోజిక వర్గాల్లో ఈ ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంతో ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.అయితే ఊహించని విధంగా చాలా నియోజిక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.బహిరంగంగానే నిలదీస్తున్నా పరిస్థితి.దీంతో ప్రజల్లోకి వెళ్ళే దైర్యం చేయడంలేదు వైసీపీ నేతలు.అలా ప్రజల్లో తిరగడానికి వెనకడుతున్న 40 మంది ఎమ్మెల్యేలకు సిఎం జగన్ గతంలోనే వార్నింగ్ లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.తప్పనిసరిగా ప్రజల్లో తిరగాలని, లేకపోతే వేటు తప్పదని హెచ్చరించారు కూడా.

అయినప్పటికి కొంతమంది ఎమ్మేల్యేలు స్థానిక నియోజిక వర్గాల్లో తిరగడానికి వెనుకడుగు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో సిఎం జగన్ మరోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఫోకస్ చేశారు.ఈ నెల 21 వ తేదీన మంత్రులు, ఎమ్మేల్యేలు, నియోజిక వర్గ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కొ ఆర్టీనేటర్లు.వంటి వారితో సమీక్షా నిర్వహించనున్నారు సిఎం జగన్.
ఈ సమీక్షలో ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరుపైనే చర్చించే అవకాశం ఉందట.దీంతో గతంలోనే వార్నింగ్ లకు గురైన ఎమ్మేల్యేలపై( MLAs ) జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది పార్టీ నేతలను సైతం కలవర పెడుతోందట.
ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఇకపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే జగన్ ఆలోచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.మరి ఏం జరుగుతుందో చూడాలి.







