Prashanth Varma : హనుమాన్ మూవీపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. మేము రిస్క్ చేయడం లేదంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashanth varma ) దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్.ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Prashanth Varma Sensational Comments About Hanuman-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన విజువల్స్ చూసి ఫాన్స్ ఫిదా అయ్యారు.ఇక తాజాగా ఆది పురుష్ సినిమా చూసిన తర్వాత అందరి చూపు హనుమాన్ సినిమా పై పడింది.

Telugu Adipurush, Hanuman, Prashanth Varma, Sensational, Teja Sajja, Tollywood-M

ఇది ఇలా ఉంటే తాజాగా హనుమాన్ సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పలు కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.మేము రిస్క్ చేయడం లేదు.హనుమాన్ ను మోడ్రనైజ్ చేసి చూపించడం లేదు.అతను నుంచి హనుమంతుడు అందరికీ ఎలా తెలుసు అలాగే చూపిస్తున్నాము.హనుమంతుని పాత్ర కోసం మేమందరం ఏడాది పాటు రీసెర్చ్ చేసాము తెలిపారు ప్రశాంత్ వర్మ.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Telugu Adipurush, Hanuman, Prashanth Varma, Sensational, Teja Sajja, Tollywood-M

ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత చాలామంది నెటిజన్స్ హనుమాన్ సినిమా కూడా ఈ విధంగానే ఉంటుందేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ వార్తలన్నీ కూడా ఒట్టి అవాస్తవాలే అని కొట్టి పరేశారు.ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.అ!,కల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ.త్వరలోనే హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి మరి.అభిమానులు నెటిజన్స్ తో పాటు చిత్ర బృందం కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube