బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్( Rakhi Sawanth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఖీ సావంత్, బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అలాగే ఈమె కాంట్రవర్సీల ద్వారా కూడా బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.
కాగా రాఖీ సావంత్ సినిమాల ద్వారా కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది.

తరచూ ఏదో ఒక గొడవతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు.ఆదిల్ ఖాన్‌తో( Adil Khan ) ప్రేమ, పెళ్లి కొన్ని నెలలకే విడాకులు ఇలా ప్రతీ విషయం మీడియాలో వార్తగా మారిపోయింది.కాగా మొన్నటి వరకు ఆదిల్‌తో గొడవలతో రాఖీ మీడియాలో తెగ హల్‌చల్ చేశారు.
ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా రాఖీ సావంత్ ముంబైలోని( Mumbai ) ఒక షాపింగ్ మాల్‌కు వెల్లింది.
షాపింగ్ ముగించుకుని బయటకు వచ్చారు.అయితే అప్పటికే ఆమె కోసం బయట వేచి ఉన్న పాపరజీలు ఒక్కసారిగా ఫొటోలు, వీడియోల కోసం ఆమె చుట్టూ చేరారు.
దాంతో ఆమెకు చిర్రెత్తు కొచ్చింది.

వారి నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు తీసింది.అయితే ఆమె వారి నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు తీస్తున్న కూడా వారు ఆమెను విడిచిపెట్టకుండా ఆమె వెంట పడ్డారు వారు ఆమె వెంటపడ్డారు.ఆమెతో పాటే పరుగులు తీశారు.
నా వెంట రాకండి.పోండి అంటూ ఆమె వారిని బతిమాలింది.
పరుగులు తీసే ఓపిక లేక ఒక చోట ఆగిపోయింది.రాఖీ వెంట పడ్డ పాపరజీలు.
ఆమె ఆగగానే ఫొటోలు, వీడియోలు తీసుకుని వెళ్లిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.పాపం రాఖీకి ఇదేం ఖర్మ అందరు కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించిన వారిపై మండిపడుతున్నారు.
వారికి ఇష్టం లేదు అన్నప్పుడు అలా ఒక మహిళను అలా రోడ్డుపై పరుగులు తీయించి ఫోటోలు తీసుకోవడం ఏమీ బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







