ఈరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు టీ షర్ట్స్( T-shirts ) ధరిస్తున్నారు.అయితే వీటిని టీషర్ట్స్ అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియదు.
కాగా తాజాగా వీటిని ఆ పేరుతోనే ఎందుకు పిలుస్తారో తెలిసిపోయింది.గతంలో ఉన్న ప్రచారం ప్రకారమైతే T- షర్టు అనే పదం దాని ప్రాథమిక ఆకారం నుంచి వచ్చింది.
సాధారణంగా టీ షర్ట్‌ను ఫ్లాట్‌గా ఉంచినప్పుడు అది “T” అక్షరాన్ని పోలి ఉంటుంది.ఈ కారణంగా ఈ డ్రెస్‌ను మొదట్లో “టీ” లేదా “టీ-షర్ట్” అని పిలిచేవారు.
నిజానికి టీషర్టును 20వ శతాబ్దం ప్రారంభం నుంచే తొడగడం స్టార్ట్ చేశారు.ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ నేవీలో( United States Navy ) పురుషులు వీటిని లోదుస్తులుగా ధరించేవారు.
ఈ అండర్ షర్టులు షార్ట్ స్లీవ్స్, రౌండ్ నెక్ కలిగి ఉంటాయి.ఈ ఫీచర్ల వల్ల టీషర్ట్స్ నేవీ అధికారులకు సౌకర్యవంతమైనవి మారాయి.కాలక్రమేణా, ఈ టీ షర్ట్స్ మామూలు జనాల్లో కూడా పాపులర్ అయ్యాయి.

“టీ-షర్ట్” అనే పదం 1920లలో విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు.టీ-షర్టులు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనూ మరింత గుర్తింపు పొందాయి, ఎందుకంటే అవి సైనిక యూనిఫాంలో భాగమయ్యాయి.ప్రధానంగా ట్రైనింగ్ సెషన్స్‌లో ఈ షర్టులను వేసుకునేవారు.
ఈ షర్టులను సాధారణంగా తేలికైన, బ్రీతబుల్ కాటన్ ఫాబ్రిక్‌తో తయారు చేసేవారు.

ఫిజికల్ ట్రైనింగ్ సెషన్స్ లో ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండేది.ట్రైనింగ్ తీసుకునేటప్పుడే వీటిని తొడుక్కునేవారు కాబట్టి ట్రైనింగ్ షర్ట్స్ ట్రైనింగ్ షేడ్స్ అని అప్పట్లో అనేవారు.కాలక్రమేణా వాటిని షార్ట్‌కట్‌లో టీ షర్ట్స్ అని పిలవడం ప్రారంభించారు.
ఆ విధంగా షేపు ఆధారంగా మాత్రమే కాకుండా మరొక కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది.







