ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్( Truecaller ) అద్భుతమైన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను నిత్యం పరిచయం చేస్తూనే ఉంది.ఇందులో భాగంగా ఈ యాప్ గతంలో కాల్ రికార్డింగ్ ఫీచర్ పరిచయం చేసింది.
కొన్ని కారణాలవల్ల దానిని తొలగించింది.మళ్లీ ఇప్పుడు ఆ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు( Android ,iOS users ) లాంచ్ చేసింది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో నివసిస్తున్న యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.కాగా మరికొద్ది నెలలలో ఈ ఫీచర్‌ను ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల్లో కూడా లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది.

కొత్తగా రీ-లాంచ్ చేసిన కాల్ రికార్డింగ్ ఫీచర్ ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.దీని సహాయంతో ఇరువైపులా కాల్‌ను ఫుల్ క్లారిటీతో రికార్డ్ చేయవచ్చు.అంతేకాదు అన్ని కాల్ రికార్డింగ్స్ నుంచి సమ్మరీ రూపంలో ట్రాన్స్‌క్రిప్షన్స్ పొందవచ్చు.అంటే మాట్లాడిన మాటలు టెక్స్ట్ రూపంలో పొందవచ్చు.సాధారణంగా ఒక కాల్‌లో మాట్లాడే మాటలు చాలా ఎక్కువగా ఉండొచ్చు.ఈ మాటలు టెక్స్ట్ రూపంలో మారిన తర్వాత.
వాటిని నావిగేట్ చేయడానికి వీలుగా ఒక సబ్జెక్టు లైన్‌ను కూడా ఈ ఫీచర్ ఆఫర్ చేయనుంది.ఉదాహరణకి ఒక కాల్‌లో డిన్నర్ గురించి మాట్లాడితే అది మాత్రమే టెక్స్ట్ లో దొరికేలా ఈ ఫీచర్ డిన్నర్ అనే ఒక చిన్న సబ్జెక్ట్ లైన్ రాస్తుంది.
ఇలా చేయడానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ట్రూ కాలర్ వినియోగిస్తుంది.

పైన పేర్కొన్న పనులన్నీ గతంలో తీసుకొచ్చిన స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్( Screen recording feature ) ద్వారా చేయడం సాధ్యం కాలేదు.కానీ ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.వాటిని సద్వినియోగం చేసుకుంటూ కాల్ రికార్డింగ్ ఎక్స్‌పీరియన్స్ గొప్పగా అందించవచ్చని కంపెనీ భావించింది.
అనుకున్నదే తడవుగా అదిరిపోయే టెక్నాలజీతో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను రీఇండ్రడ్యూస్ చేసింది.







