మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఒకరు.మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్ట పడుతున్నాడు.
మెగా హీరో అనే చట్రం నుండి బయటపడి తనకంటూ స్పెషల్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కోవాలని బాబు ఆరాట పడుతున్నాడు.

ఈ క్రమంలోనే సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన విరూపాక్ష సినిమా( Virupakasha )తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత సాయి తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు.

వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ”బ్రో”( Bro ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.అంచనాలు భారీగా పెంచేసుకున్న ఈ సినిమాను సముద్రఖని( Samuthirakhani ) డైరెక్ట్ చేస్తుండగా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సన్నద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు సాయి తేజ్.

అందులో సంపత్ నంది( Director Sampath Nandi ) సినిమా ఒకటి.సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత సంపత్ నంది సాయి తేజ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు.మరి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.”గాంజా శంకర్” ( Gaanja Shankar) అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్టు టాక్.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్ నంది సాయి తేజ్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడు.చూడాలి ఈ కాంబో అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో.







