మీరే కాదు.. నేను కూడా స్విమ్మింగ్ చేస్తా..బీచ్‌లో ఎలుగుబంటి హల్‌చల్

మీరే కాదు… నేను కూడా ఎంజాయ్ చేస్తాననని అంటోది ఒక ఎలుగుబంటి.బీచ్‌లో మనుషులతో పాటు కలిసి సందడి చేసింది.

 Bear Swimming In Florida Beach Viral, , Bear, Beach, Florida , Viral News, Lat-TeluguStop.com

ప్రజల మధ్యలో బీచ్ లో కూర్చోని ఎంజాయ్ చేస్తుంది.ప్రజలందరూ బీచ్ లో ఆనందంగా ఈత కొడుతుండగా.

ఎలుగుబంటి కూడా స్విమ్మింగ్ చేస్తోంది.మనుషులే కాదు.

తాను కూడా స్విమ్మింగ్ చేస్తాననేలా ప్రవర్తించింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఫ్లోరిడాలోని ఒక బీచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఫ్లోరిడా బీచ్( Florida ) సమీప ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.అలాగే ఈ బీచ్ లో మొసళ్ల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది.ఫ్లోరిడాలోని డెస్టిన్ లోని ఉన్న బీచ్ లో కొంతమంది ప్రజలు స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్నారు.

అయితే ఉన్నట్లుండి ఒక ఎలుగుబంటి వచ్చింది.అది కూడా నీటి లోపలికి దిగి ఈత కొడటం స్టార్ట్ చేసింది.

ప్రజల మధ్యనే ఉంటూ స్విమ్మింగ్ చేసింది.దీనిని కొంతమంది అక్కడ ఉన్నవారు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియోలో ఎలుగుబంటి( Bear ) ఈదుకుంటూ అక్కడ నుంచి ఒడ్డుకు పరుగెత్తుకుంటూ వచ్చింది.

కొంతమంది అక్కడ ఉన్నవారు ఈ సంఘటనను ఆసక్తికరంగా చూశారు.

ఇక మరికొంతమంది ఆశ్చర్యానికి గురయ్యారు.కొంతమంది ఎలుగుబంటిని చూసి పరుగులు పెట్టారు.

ఈ వీడియోను జెన్నిఫర్ మేజర్స్ స్మిత్ అనే వ్యక్తి సోషల్ మీడియ( Social media )లో షేర్ చేశాడు.తాను ఎప్పుడూ ఇలాంటి ఘటనను చూడలేదని కామెంట్ పెట్టాడు.

ఈ వీడియోలోని ఎలుగుబంటి నల్లగా ఉంది.ఈ వీడియో చాలామందిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.పలువురు కామెంట్ చేస్తోన్నారు.

మనుషులకు ఏ మాంత్రం తగ్గకుండా స్విమ్మింగ్ చేయడానికి వచ్చిందని కామెంట్ చేస్తోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube