ఏపీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు అందనున్నాయి.ఈ మేరకు ఏర్పాటు చేసిన వంద జియో టవర్లను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.
ఇందులో భాగంగా 209 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి.అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10., అన్నమయ్య జిల్లాలో మూడు టవర్లతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో రెండు టవర్లను సీఎం జగన్ ఒకేసారి ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో టవర్ల ఏర్పాటు 2,363 చోట్ల స్థలాలను ప్రభుత్వం అప్పగించింది.డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణను అధికారులు రూపొందించారు.







