టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ( Koratala shiva ) ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.
కానీ మొదటిసారి ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు.చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా అనుకున్నారు.
కానీ భారీ ప్లాప్ మూటగట్టుకున్నాడు.

వరుసగా విజయాలు మాత్రమే అందుకుంటున్న కొరటాలకు ఈ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది.ఆచార్య విషయంలో ఈయన లెక్క తప్పింది.ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.
అందుకే ఈ సినిమాకు జరిగిన విధంగా తన తర్వాత సినిమాకు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో దేవర సినిమా( Devara movie ) చేస్తున్న విషయం తెలిసిందే.
ఆచార్య తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకుని అప్పుడు ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసారు.ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ రోజు కొరటాల శివ తన పుట్టిన రోజు( Koratala shiva Birthday ) జరుపు కుంటున్నారు.ఈ క్రమంలోనే ఈయనకు బర్త్ డే విషెష్ చెబుతూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.

దేవర టీమ్ కొరటాల శివ ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెష్ తెలిపారు.ఇక ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంది.అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.







